రంగారెడ్డి జిల్లా చేవెళ్లలోని శంకర్పల్లి చౌరస్తా లో పూర్తి ఇన్ఫర్మేషన్ తో చేవెళ్ల పోలీసులు మరియు స్పెషల్ పోలీసులు కలిసి 32 బ్యాగుల్లో 64 కిలోల గంజాయిని పట్టుకోవడం జరిగింది. ఇందులో 32 బ్యాగులను రెండు మొబైల్ లను సీజ్ చేయడం జరిగింది. నలుగురు వ్యక్తులు ఈ గంజాయిని తరలిస్తున్నట్టు సమాచారం అందుకున్న పోలీసులు అక్కడ వెళ్లి చూడగా 32 బ్యాగులుల్లో గంజాయి దొరకడం జరిగింది దీని విలువ సుమారు 16 లక్షలు ఉంటుందని అంచనా వేశారు.
ఇందులో ముగ్గురు మగవారు ఒక ఆడమనిషి ఉన్నారని మగవారిలో ఒక మైనర్ బాలుడు ఉన్నాడు. ఈ గంజాయిని ఒరిస్సా ప్రాంతం నుంచి మహారాష్ట్రకు తరలిస్తున్నట్లు సమాచారం. ఈ గంజాయి తరలించడంలో ఎలాంటి సొంత వాహనం వాడకుండా ఒరిస్సా నుంచి లారీలు ఎక్కుకుంటూ చివరకు చేవెళ్ల చౌరస్తాకు చేరుకుని అక్కడి నుంచి సంగారెడ్డి వెళ్ళడానికి లారీలను అపుతున్న క్రమంలో సమాచారం అందుకున్న పోలీసులు వెల్లి పట్టుకోవడం జరిగింది.
ఇందులో గంజాయి తరలిస్తున్న వ్యక్తులు 1. చిత్ర కైలాస్ మోహిత్ (35), w. నవనత్ గణపత్ చౌహాన్ (70), 3. మదన్ బాల సాహెబ్ బయాస్ (38), 4. రాజేష్ సుభాష్ మోహిత్ (15) గా గుర్తించారు. ఇందులో విశేషమేమంటే నిందితుడిగా 15 సంవత్సరాల మైనర్ రాజేష్ సుభాష్ మోహిత్ ఉండడం. గంజాయి నీ ఒరిస్సా నుండి మహారాష్ట్రకు తరలిస్తున్నారు.
Rangareddy
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం మొయినాబాద్ మండలములోని చాకలి గూడ గ్రామ పరిధిలో ఉన్నహ్యాపీ హోం ఫామ్ హౌస్ కొంతమంది వ్యక్తులు కలసి కొంతమంది అమ్మాయిలతో పడుపు వృత్తి నిర్వహిస్తున్నారనే సమాచారంతో మొయినాబాద్ పోలీసులు మరియు స్పెషల్ టీం తో కలసి ఇద్దరు పంచుల సమక్షంలో రైడ్ చేయగా నలుగురు కస్టమర్ లు మరియు ముగ్గురు అమ్మాయిలు ఇద్దరు ఆర్గనైసర్ లు ఒక వాచ్‌మేన్ లు దొరికినారు వీరి వద్దనుండి మొత్తం. 17880/- 17 కండోమ్ ప్యాకెట్స్, 11 ఫోన్ లను స్వాధీన పరుచుకున్నారు.
Follow us on : Facebook, Instagram & YouTube.
వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డ వారు(prostitution gang):
ఫామ్ హౌస్ ఆర్గనైజర్ శ్రీనివాసరాజు, వాచ్ మెన్ సంపత్ గా గుర్తించారు అలాగే అందులో ఉన్న కస్టమర్ గా, రామకృష్ణ, సంతోష్, రమాకాంత్, అభిలాష్ రెడ్డి గా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
మరిన్నితాజావార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Read more: ఫాం హౌస్ లో వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డ వ్యక్తులు..- తెలంగాణ రైతుల కి మరో శుభవార్త చెప్పిన కాంగ్రెస్ సర్కార్by Prakashతెలంగాణ రైతులకు మరో శుభవార్త చెప్పేందుకు రేవంత్ ప్రభుత్వం సిద్ధమవుతోంది. రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. తెలంగాణ రైతుల కి మరో శుభవార్త చెప్పిన కాంగ్రెస్ సర్కార్. రైతు రుణమాఫీని ఆగస్టు 15వ తేదీలోపు…
- హోమ్ మినిస్టర్ గా వంగలపూడి అనిత పదవి స్వీకరణby Prakashఆంధ్రప్రదేశ్ హోమ్ మినిస్టర్ గా వంగలపూడి అనిత పదవి స్వీకరణ బాధ్యతలను స్వీకరించారు. సచివాలయంలోని బ్లాక్-2లో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆమె బాధ్యతలను స్వీకరించారు. ఆమెకు వేదపండితులు ఆశీర్వచనాలు అందజేశారు. ఇక హోంమంత్రిగా బాధ్యతలు స్వీకరించడంతో అనితను పార్టీ నేతలతో…
- మహానంది లో మరోసారి చిరుతపులిby Prakashనంద్యాల జిల్లా మహానందిలో చిరుత పులి మళ్లీ ప్రత్యక్షమవడంతో ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. గత అర్ధరాత్రి దాటాక స్థానిక పార్వతీపురం పాత వివేకానంద స్కూల్ వద్ద చిరుత సంచరిస్తుండటంతో ….. ప్రజలు గట్టిగా కేకలు వేయడంతో పక్కనే ఉన్న అటవీ ప్రాంతానికి…
బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు మూడు నెలల తర్వాత అసెంబ్లీ ఎన్నికల అనంతరం తొలిసారి పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చారు. కృష్ణా జలాల పరిరక్షణ సభ ఏర్పాట్లను సమీక్షించారు. మహబూబ్‌నగర్, రంగారెడ్డి, ఖమ్మం, నల్గొండ జిల్లాల ప్రతినిధులతో సమీక్షించి కృష్ణా జలాల అంశంపై నేతలకు దిశా నిర్దేశం చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావుతో పాటు పలువురు కీలక నేతలు సైతం తెలంగాణ భవన్‌కు వచ్చారు. అయితే, కాంగ్రెస్ ప్రభుత్వం కృష్ణా పరిధిలోని ప్రాజెక్టులన్నీ కేఆర్ఎంబీకి అప్పగించారని భారత్ రాష్ట్ర సమితి భారీ ఉద్యమానికి సిద్ధమవుతోంది. కేఆర్ఎంబీపై కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం, తెలంగాణ ప్రయోజనాలపై ఆ పార్టీ చిత్తశుద్ధిని ప్రజల్లోకి తీసుకపోయే విధంగా ఉద్యమ కార్యాచరణపై చర్చించారు.
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం జిల్లేడు చౌదరిగుడ మండలంలోని పెద్ద ఎల్కిచర్ల అటవీ క్షేత్రంలో చిరుత పులి అనుమానస్పద రీతిలో మృత్యు వాత పడింది. గత ఐదారు మూడు రోజుల క్రితమే చిరుత మృత్యువాత పడ్డట్టు ప్రాథమిక అంచనాగా అటవి అధికారులు గుర్తిస్తున్నారు. అటవీశాఖ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని చిరుత కళేబరానికి పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు. చిరుత పులి మృతికి కారణాలను పరిశీలిస్తున్నారు. పెద్ద ఎల్కిచర్ల పెద్దడవి 654 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. ఈ అడవిలో క్రూర మృగాలు ఉన్నట్టు గ్రామస్తులు చెబుతున్నారు. అయితే గొర్ల కాపరులకు చిరుత మరణించిన విషయం తెలుసుకొని గ్రామంలో ఈ సమాచారాన్ని చెప్పారు. దీంతో సమాచారం అందుకున్న అటవి శాఖ సిబ్బంది ప్రస్తుతం సంఘటనా స్థలాన్ని సందర్శించి సంఘటనపై వివరాలు సేకరిస్తున్నారు. చిరుత పులి పోస్టుమార్టం అనంతరం నివేదికను ఉన్నతాధికారులకు పంపనున్నారు. ఆ తర్వాత మీడియాకు జరిగిన సంఘటనపై వివరాలు తెలిపే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా క్రూరమృగాలు సంచరిస్తున్న ఈ అటవీ చుట్టుపక్కల గ్రామాలలో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారని, అటవీశాఖ అధికారులు చిరుతపులులు జనావాసాల్లోకి రాకుండా ప్రత్యేక ఏర్పాటు చేయాలని కోరుతున్నారు..
కుక్కల దాడిలో ప్రాణాలు కోల్పోయిన చిన్నారి…నిద్రపోతున్న మున్సిపాలిటీ అధికారులు
వీధికుక్కల దాడిలో చిన్నారి ప్రాణాలు విడిచాడు. 20 కుక్కలు ఒకేసారి దాడి చేయడంతో ఆ చిన్నారి అక్కడిక్కడే మృతిచెందాడు. కుక్క కాట్లకు గురైన ఓ చిన్నారి ఏడాది వయసులోనే కన్నుమూశాడు. ఇంటి వద్ద నిద్రపోతున్న చిన్నారిని కుక్కలు రోడ్డుపైకి లాక్కేలి మరీ చంపేశాయి. ఆ బాలుని మృతితో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. అప్పటివరకూ తమతో ఆడుకుంటున్న చిన్నారి ఒక్కసారిగా విగతజీవిగా పడి ఉండడం చూసిన చిన్నారి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ హృదయ విదారకర సంఘటన మహబూబ్ నగర్ దేవరకద్ర నాగారం గ్రామానికి చెందిన సూర్యకుమార్ కుటుంబంలో జరిగింది. సూర్యకుమార్ తన భార్య ఇద్దరు పిల్లలతో కలిసి సమా ఎన్ క్లూ కాలనీలో జీవితం సాగిస్తున్నాడు. పెద్దకుమారుడి పేరు నాగరాజు ఆ బాలుని వయస్సు ఏడాది. అయితే గురువారం అర్ధరాత్రి సూర్యకుమార్ ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో నాగరాజును 20 కుక్కలు ఒకేసారి దాడి చేసి రోడ్డుపైకి ఈడ్చుకెళ్లాయి. ఈ విషయాన్ని ఇంట్లో నిద్రిస్తున్న సూర్యకుమార్ గానీ ఆ బాలుని తల్లిగానీ గమనించలేదు పడుకొని లేచి చూసిన సూర్య కుమార్ కు నాగరాజు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు ఇద్దరు కంగారు పడ్డారు. తన కొడుకు నాగరాజు కోసం చుట్టుపక్కన వెతికిన ఎక్కడ కనిపించలేదు చివరకు రోడ్డుపై వచ్చి చూసేసరికి కుక్కలు లాక్కెళ్ళి చంపేసాయని గుర్తించారు. గతంలో మున్సిపాలిటీ పరిధిలో అనేకసార్లు కుక్కలు చిన్నారులపై దాడి చేసిన మున్సిపాలిటీ అధికారులు పట్టించుకోవడం లేదు.
రంగారెడ్డి జిల్లా.. చేవెళ్ల డివిజన్ షీ టీమ్ బృందం రోజువారి కూలీలకు అలాగే బీహార్ కూలీలకు షాబాద్ మండలం నాగర్ గూడ గ్రామంలో తాళ్లపల్లి సర్పంచ్ పెంటయ్య ఆధ్వర్యంలో అవేర్నెస్ ప్రోగ్రామును నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మీరు అప్రమత్తంగా ఉండాలని ఎలాంటి ఫేక్ కాల్స్ కానీ ఓటీపీలు కానీ తెలుపవద్దని మీ కార్మికులందరూ ఆయా గ్రామాల కింద రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఆమె కోరారు ఏమైనా సమస్య ఉంటే ముందుగా పోలీసు వారికి తెలియజేయాలని ఆమె తెలిపారు. అలాగే మీ యొక్క చిన్న పిల్లలను మీతో పాటు తీసుకెళ్లకుండా దగ్గరలో ఉన్న పాఠశాలలో కానీ లేదంటే హాస్టల్లో ఉంచి చదివించాల్సిందిగా ఆమె కోరారు. ఈ యొక్క కార్యక్రమంలో షీ టీం ఇన్చార్జ్ ఎస్ఐ పద్మ, వారి బృందం, మల్లేష్, వైద్యనాత్, తాళ్లపల్లి సర్పంచ్ సమ్మి పెంటయ్య తదితరులు పాల్గొన్నారు.
కోమటిరెడ్డి వెంకట రెడ్డి మంత్రి కాగానే అధికారమదంతో ప్రవర్తిస్తున్నారని ఆయనకు అహంకారం పెరిగిందని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మండిపడ్డారు. సూర్యాపేట బీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో అధికారిక కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డిపై కోమటిరెడ్డి, అతని అనుచరులు అనుచితంగా ప్రవర్తించారని ఆరోపించారు. సందీప్ రెడ్డి వాళ్ల నాన్న ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన పేరు చెప్పి సిగరెట్లు అందించుకుంటూ బతికావని ఆ విషయం మరిచిపోయవా? అని ప్రశ్నించారు. చరిత్ర తీద్దామా? వ్యక్తిగత విమర్శలు వద్దని ఇన్ని రోజులు ఊరుకున్నామని హెచ్చరించారు. ఉద్యమం సమయంలో కిరణ్ కుమార్ రెడ్డి గెంటేస్తున్నాడని తెలిసి రాజీనామా చేసి పెద్ద త్యాగం చేశానంటూ డ్రామాలు చేశాడని ఆరోపించారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం మద్దుకూరు గ్రామాంలో ఎలుగుబంటి దాడి కలకలం రేపింది. నల్లమోతుల రామారావు అనే వ్యక్తి ఉదయం వాకింగ్ కి వెళ్తున్న సమయంలో ఒక్కసారిగా ఎలుగుబంటి దాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఇది గమనించిన స్థానికులు హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం విజయవాడకు తరలించారు. విషయం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు అప్రమత్తమయ్యి ఎలుగుబంటి ఆచూకి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. దర్యాప్తు అనంతరం పుర్తి వివరాలను వెల్లడిస్తామని తెలిపారు.
రంగారెడ్డి జిల్లా, చేవెళ్లలో చందనవెల్లి గ్రామంలో పర్యటించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఈ సందర్బంగా చందనవెల్లి భూ బాధితులు భట్టి విక్రమార్కని కలిశారు.చందనవెల్లి గ్రామంలోని సర్వే నెంబర్ 190లోని భూసేకరణలో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ జరిపిస్తామని అన్నారు. గత ప్రభుత్వంలో అవకతవకలతో భూసేకరణ జరిగిందని, భూసేకరణ పరిహారం అర్హులకు రాకుండా బోగస్ లబ్ధిదారులు తీసుకున్నారని దీనిపై విచారణ చేయాలని భూ బాధితులు కోరగా, సమగ్ర విచారణ చేయిస్తానని హామి ఇచ్చారు. చందనవెల్లిలో సోలార్ పరిశ్రమను ప్రారంభించారు. స్థానికంగా ఏర్పాటు చేసిన పరిశ్రమల్లో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని భట్టి తెలిపారు.
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే కాలే యాదయ్య జాతీయ జెండాను ఎగురవేసి జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం మిఠాయిలు పంచుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే కాలే యాదయ్య మాట్లాడుతూ.. భారత రాజ్యాంగం 1950 జనవరి 26వ, తేదీన అమల్లోకి రావడంతో ఇక అప్పటి నుంచి ఏటా గణతంత్ర దినోత్సవంను జరుపుకుంటున్నామని అన్నారు. చేవెళ్ల ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.




Total views : 196363