అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, డెమోక్రాట్ అభ్యర్థి కమలా హారిస్ హోరాహోరీగా ప్రచారం చేస్తున్నారు. ప్రపంచ దేశాల నుంచి వచ్చి స్థిరపడిన ఓటర్లను ఆకట్టుకునేందుకు ఇరు పార్టీలు విశ్వ ప్రయత్నం చేస్తున్నాయి. ముఖ్యంగా భారత మూలాలున్న కమలా హారిస్ ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలోని ‘నాటునాటు’ పాటను ఎన్నికల ప్రచారంలో వాడుకుంటున్నారు. ‘నాటునాటు’ పాట స్ఫూర్తితో హిందీలో ‘నాచో నాచో’ గీతాన్ని రూపొందించారు. ఈ పాటను భారత-అమెరికన్ నాయకుడు అజయ్ భుటోరియా విడుదల చేశారు.
‘నాచో నాచో’ కేవలం పాట మాత్రమే కాదని… ఇదొక ఉద్యమమని అజయ్ భుటోరియా చెప్పారు. దక్షిణాసియా అమెరికన్ కమ్యూనిటీతో అనుసంధానం కావడమే తమ ప్రచార లక్ష్యమని చెప్పారు. ఎన్నికల్లో ఓటు వేయడానికి 4.4 మిలియన్ల ఇండియన్ అమెరికన్ ఓటర్లు, 6 మిలియన్ల దక్షిణాసియా ఓటర్లు అర్హత కలిగి ఉన్నారని… కమలా హారిస్ కు మద్దతుగా వీరిని కూడగట్టడమే తమ లక్ష్యమని అన్నారు.
ఈ ఎన్నికల్లో కమలా హారిస్ గెలిస్తే… 248 ఏళ్ల అమెరికా చరిత్రలో అధ్యక్ష పీఠాన్ని అధిరోహించిన తొలి మహిళగా కమల చరిత్ర సృష్టిస్తారని భుటోరియా అన్నారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- 280 ఎకరాల వెంచర్ వ్యవహారంలో వివాదాలు.ప్రముఖ రియల్టర్, హోమ్‌ల్యాండ్ అధినేత బాణాల రాంరెడ్డి ఆత్మహత్యకు పాల్పడ్డారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం నేదునూరులోని తన ఫాంహౌస్‌లో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. పటాన్‌చెరులో 280 ఎకరాల్లో వెంచర్ అభివృద్ధి చేస్తున్న రాంరెడ్డి.. స్థానిక నేతలు, పలువురి ఒత్తిళ్లతో తీవ్ర…
- ఢిల్లీ వేదికగా 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు.భారత్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు సెప్టెంబర్ 12, 13 తేదీల్లో న్యూఢిల్లీలో జరగనుంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన భారత్ మండపంలో ఈ సదస్సు నిర్వహించనున్నారు. 2026 సంవత్సరానికి బ్రిక్స్ అధ్యక్ష బాధ్యతలను భారత్ చేపట్టడంతో…
- విజయ్ నేతృత్వంలో ‘సామాజిక న్యాయ విజయ కూటమి’.తమిళనాడు రాజకీయాల్లో విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం మరో కీలక రాజకీయ అడుగు వేసింది. టీవీకే ఆధ్వర్యంలో ఏర్పడిన కొత్త కూటమికి సామాజిక న్యాయ విజయ కూటమి గా పేరు ఖరారైంది. విజయ్ అధ్యక్షతన చెన్నై పనయూర్‌లో జరిగిన సమన్వయ…
- యాదగిరిగుట్టకు భారీగా తరలివస్తున్న భక్తులు: బీర్ల ఐలయ్య.తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్టకు నిత్యం పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య అన్నారు. భక్తుల రాకపోకలకు అనుగుణంగా యాదగిరిగుట్ట ఆర్టీసీ డిపోను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. డిపో పరిధిలో భద్రత కోసం సీసీ…
- కారుమూరి నాగేశ్వరరావుకు మరో షాక్.లిక్కర్ రవాణా టెండర్ల కేసులో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుకు మరో షాక్ తగిలింది. ఇదే కేసులో చర్లపల్లి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న కారుమూరిపై సిట్ అధికారులు ఏసీబీ కోర్టులో పీటీ వారెంట్ దాఖలు చేశారు. విచారణ చేపట్టిన కోర్టు..…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి