నిజం గెలవాలి… కార్యక్రమంలో భాగంగా బద్వేల్ నియోజకవర్గం లోని పోరుమామిళ్ళ కు వెళ్తూ మార్గ మధ్యలో అట్లూరు కూడలి వద్ద ఆగారు. మాజీ ఎమ్మెల్యే విజయమ్మ, యువ నాయకులు రితీష్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో నారా భువనేశ్వరి కి ఘనస్వాగతం పలికారు. కడప పార్లమెంటు రాష్ట్ర తెలుగు మహిళా ఉపాధ్యక్షురాలు ఝాన్సీ, కడప పార్లమెంట్ మహిళా అధ్యక్షురాలు సుధారాణి, బద్వేల్ నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు మాచుపల్లి లక్ష్మీదేవి, సెక్రటరీ ఆదిలక్ష్మమ్మ తో పాటు.. మహిళా నాయకులు హారతి పట్టి, పూల మాలలతో స్వాగతం పలికారు. స్థానిక నాయకులు టిడిపి అధ్యక్షులు మల్లికార్జున్ రెడ్డి. రెడ్డప్ప రెడ్డి మాజీ అధ్యక్షులు మన్యం మహేశ్వర్ రెడ్డి అమర్నాథరెడ్డి సారథ్యంలో చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరిని చూడడానికి ప్రజలు స్థానిక కార్యకర్తలు పూలమాలలతో బొకేలతో కేకులతో ఎగబడ్డారు. ప్రజలకు కార్యకర్తలకు అభివాదం చేస్తూ నారా భువనే శ్వరి పోరుమామిళ్ల కు వెళ్లారు.
అట్లూరు కూడలి వద్ద భువనేశ్వరికి ఘనస్వాగతం…
195
previous post