Wednesday, August 26, 2026
News Navigation
Wednesday, August 26, 2026
News Navigation

Breaking

Wednesday, August 26, 2026
Home Political ఆస్కార్‌ అవార్డుల ప్రదానోత్సవం అమెరికాలోని లాస్‌ ఏంజిలిస్‌లో ఘనంగా జరిగింది.

ఆస్కార్‌ అవార్డుల ప్రదానోత్సవం అమెరికాలోని లాస్‌ ఏంజిలిస్‌లో ఘనంగా జరిగింది.

by CVR NEWS

ఆస్కార్‌ అవార్డుల ప్రదానోత్సవం అమెరికాలోని లాస్‌ ఏంజిలిస్‌లో ఘనంగా జరిగింది. వన్‌ బ్యాటిల్‌ ఆఫ్టర్ అనదర్‌ చిత్రం ఏకంగా ఆరు ఆస్కార్‌ పురస్కారాలను అందుకుంది. బ్లాక్‌ కామెడీ యాక్షన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన చిత్రంలో లియోనార్డో డికాప్రియో కీలక పాత్ర పోషించారు. మొత్తం 13 విభాగాల్లో ఈ సినిమా అవార్డులకు నామినేట్‌ కాగా…. ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ సహాయ నటుడు, ఉత్తమ అడాప్టెడ్‌ స్క్రీన్‌ప్లే, ఉత్తమ క్యాస్టింగ్‌, ఉత్తమ ఎడిటింగ్‌ విభాగాల్లో ఆరు పురస్కారాలు అందుకుంది. ఆ తర్వాత సిన్నర్స్‌ చిత్రం కూడా ఈ సారి సత్తా చాటింది. ఈ చిత్రం హీరో మైఖేల్‌ జోర్డాన్‌ ఉత్తమ నటుడిగా నిలవగా, ఒరిజినల్‌ స్క్రీన్‌ ప్లే, సినిమాటోగ్రఫీ, ఒరిజినల్‌ స్కోర్‌ విభాగాల్లో ఈ చిత్రం అవార్డులు గెలుచుకుంది. ఫ్రాంకెన్‌ స్టెయిన్ చిత్రం మూడు అవార్డులు, కేపాప్‌ డీమాన్ హంటర్స్‌ రెండు అవార్డులను సాధించింది.

మరోవైపు ఆస్కార్‌ అవార్డు ప్రదానోత్సవంలో… గత ఏడాది కన్నుమూసిన ప్రముఖ నటులను స్మరించుకోవడం ప్రత్యేకంగా నిలిచింది. అద్భుతమైన నటనతో కోట్ల మంది అభిమానులను సొంతం చేసుకొన్న నటీనటులకు ఆస్కార్‌ నివాళులర్పించింది. ఇందులో హాలీవుడ్ ప్రముఖులతో పాటు భారతీయ సినిమా నుంచి ధర్మేంద్ర, మనోజ్ కుమార్, బి.సరోజాదేవి, కోట శ్రీనివాసరావు వంటి దిగ్గజాలు కూడా ఉండడం విశేషం. వీరందరి పేర్లను అకాడమీ తన అధికారిక వెబ్‌సైట్‌లో ప్రత్యేకంగా పొందుపరిచింది.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: