రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తా బాద్ మండలం గూడెం గ్రామానికి చెందిన పెంటం చందు అనే యువకుడు అదే గ్రామానికి చెందిన ఓ యువతిని ప్రేమించి పెళ్ళి చేసుకున్నాడు.కుటుంబ సభ్యులు అభ్యంతరం చెబుతారో ఏమో అని కరీంనగర్ లో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.కాగ గ్రామం లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముస్తా బాద్ ఎస్.ఐ ఆధ్వర్యంలో ఆ గ్రామంలో పికెటింగ్ ఏర్పాటు చేశారు.అదే సమయంలో అర్థ రాత్రి పూట ఇదే మండలం రామ లక్ష్మణ పల్లె తో పాటు మరో గ్రామానికి చెందిన అయిదు ట్రాక్టర్లు ఇసుక ను నింపుకొని ముస్తా బాద్ వెళ్ళే క్రమంలో అక్కడ పోలీస్ బందోబస్తు ఉన్న బ్లూ కోర్టు పోలీసులు పెట్రోలింగ్ నిర్వహించారు.ఈ క్రమంలో అయిదు ఇసుక ట్రాక్టర్ లు బ్లూ కోర్టు కానిస్టేబుల్ సత్యనారాయణ కు తారసపడగా ఇట్టి విషయం పికేటింగ్ లో అక్కడే ఉన్న ముస్తా బాద్ ఎస్.ఐ కి సమాచారం ఇవ్వగా ట్రాక్టర్ల వద్దకు వచ్చిన ఎస్. ఐ బ్లూ కోర్టు కానిస్టేబుల్ సత్యనారాయణ ను రామ లక్ష్మణ పల్లె కు చెందిన ఓ ఇసుక ట్రాక్టర్ పై ఎక్కించి పోలీస్ స్టేషన్ కు తీసుకు రావాలని చెప్పినట్లు సమాచారం.ఎస్ ఐ ఆదేశాల మేరకు సదరు కానిస్టేబుల్ ట్రాక్టర్ పై కుర్చోగా ట్రాక్టర్ డ్రైవర్ ఉద్దేశపూర్వకంగా కానిస్టేబుల్ తో సహా ట్రాక్టర్ ను నామాపుర్ చెరువులో తోసి వేశాడు.దీంతో సత్యనారాయణ అనే కానిస్టేబుల్ కు తీవ్ర గాయాలు కాగ అతడిని చికిత్స నిమిత్తం సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతున్నాడు.
FOLLOW US ON : FACE BOOK , INSTAGARAM , YOU TUBE , GOOGLE NEWS
- ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం.ఐఐటి ఫలితాలలో కృష్ణాజిల్లా గుడివాడ విశ్వభారతి విద్యాసంస్థలు విజయకేతనం ఎగురవేశాయి. ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ సాధించిన తోట సాయి వినీల్ కు పాఠశాల చైర్మన్ పొట్లూరి శ్రీమన్నారాయణ శుభాకాంక్షలు తెలియజేశారు. తమ పాఠశాలలో ఎనిమిదవ తరగతి నుండి పదవ తరగతి…
- హైదరాబాద్ ఉప్పల్ లో కాంగ్రెస్ నేత దౌర్జన్యం.హైదరాబాద్ ఉప్పల్ లో అమానవీయ ఘటన వెలుగుచూసింది. చిన్నారులు ఇంటి ముందు క్రికెట్ ఆడారని అధికార పార్టీ నాయకుడు పిల్లల తల్లిదండ్రుల పట్ల అమానుషంగా ప్రవర్తించిన ఘటన వీడియో వైరల్ అయింది. తల్లిదండ్రులపై దాడి చేయడమే కాకుండా తన అధికార బలంతో…
- జనసేన అధినేత పవన్‌కల్యాణ్ సంచలన నిర్ణయం.ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు, సేనా గళం పేరుతో కొత్త కమిటీ ఏర్పాటు చేశారు.అమరావతిలో జనసేన ముఖ్య నేతలతో సమావేశమయ్యారు పవన్ కళ్యాణ్. వివిధ అంశాలపై చర్చించారు. అనంతరం సేనా గళం పేరుతో…
- అమెరికాలో ఓ భారత సంతతి కుటుంబంలో విషాదం.అమెరికాలో ఓ భారత సంతతి కుటుంబంలో పెళ్లి సంబరాలు విషాదంగా మారాయి. వివాహం జరిగిన కొద్ది గంటల్లోనే వరుడు హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో ఇరు కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. జార్జియాలో జరిగిన ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. కేరళ…
- శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తుల సందడి..నంద్యాల జిల్లా శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తులు సందడి నెలకొంది. వేసవి సెలవులు కావడంతో భక్తులు భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనానికి పోటెత్తారు. క్యూలైన్లన్నీ భక్తులతో నిండిపోయాయి. భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో అలంకార దర్శనానికి అనుమతినిచ్చారు. ముందుగా ఆన్లైన్లో బుక్…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.






Total views : 91132