వేములవాడ పట్టణంలో రోజురోజుకు కుక్కల బెడద తీవ్రతరమవుతుంది. గురువారం కుక్క కాటుకు నలుగురు తీవ్ర గాయాలపాలయ్యారు. విశ్వబ్రాహ్మణ వీధిలో ఓ బాలుడిపై వీధి కుక్క దాడి చేసి, తీవ్రంగా గాయపరిచింది. దీంతో బాలుడిని కుటుంబ సభ్యులు వేములవాడ ప్రభుత్వ ఏరియాకు తీసుకెళ్ళగా, గాయం తీవ్రంగా ఉండడంతో అక్కడి సిబ్బంది సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించారు. కుక్కల దాడిలో నలుగురికి తీవ్ర గాయాలు..అలాగే మున్సిపల్ సిబ్బంది సునిత, ట్రాఫిక్ సిబ్బందిపై కుక్క దాడిలో గాయపడ్డారు. అలాగే మరొకరిపై కూడా కుక్క దాడి చేయగా, ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందారు. ఈ సందర్బంగా బాధిత కుటుంబసభ్యులు మాట్లాడుతూ వీధి కుక్కలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, విచ్చలవిడిగా స్వైర విహారం చేస్తూ దాడులకు పాల్పడుతున్నాయని వాపోయారు. మున్సిపల్ అధికారులు దృష్టి సారించి, కుక్కలను నివారించాలని కోరారు.
FOLLOW US ON : FACE BOOK , INSTAGARAM , YOU TUBE , GOOGLE NEWS
- శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్‌రెడ్డి.హైదరాబాద్ ఉప్పల్ భగాయత్‌లో ఆర్యవైశ్య ఆత్మగౌరవ భవన్‌కు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య సేవలను సీఎం రేవంత్‌రెడ్డి గుర్తు చేసుకున్నారు. ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చినా.. రోశయ్య మాత్రం తన ప్రత్యేకతను…
- ‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కి థాంక్స్..‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కి థాంక్స్.. యునానిమస్ బ్లాక్ బస్టర్ సెలెబ్రేషన్స్‌లో హీరో సూరి మంచి విజయాన్ని ఇచ్చిన ఆడియెన్స్‌కి థాంక్స్.. ‘మండాడి’ యునానిమస్ బ్లాక్ బస్టర్ సెలెబ్రేషన్స్‌లో హీరో సుహాస్ ఎల్రెడ్ కుమార్ సమర్పణలో ఆర్ఎస్…
- నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.ఏపీలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా పర్యటిస్తున్నారు. విజయవాడకు చేరుకున్న కేంద్రమంత్రికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ఘన స్వాగతం పలికారు. రాష్ట్రంలో వైద్య మౌలిక వసతులను మరింత బలోపేతం చేసే దిశగా కీలక కార్యక్రమాలకు నడ్డా…
- మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో మోదీ భేటీ.బ్రిక్స్ ఇండియా 2026 సదస్సు నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ, మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం మధ్య కీలక ద్వైపాక్షిక భేటీ జరిగింది. న్యూఢిల్లీలో జరిగిన ఈ సమావేశంలో భారత్–మలేషియా సంబంధాలకు సంబంధించిన పలు అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు.…
- ఏడేళ్ల తరువాత భారత్ కు చైనా అధ్యక్షుడు జిన్ పింగ్.ఏడేళ్ల తర్వాత చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ భారత్ పర్యటనకు రానున్నారు. గాల్వాన్ వ్యాలీ ఘటన తర్వాత తొలిసారిగా భారత్‌కు వస్తున్న జిన్‌పింగ్ పర్యటనపై అంతర్జాతీయంగా ఆసక్తి నెలకొంది. మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీకి చేరుకోనున్న జిన్‌పింగ్‌తో పాటు…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.