235
ఇవాళ తిరుపతికి వెళ్లనుంది సీఎం చంద్రబాబు కుటుంబం. రేపు మనవడు దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. దేవాన్ష్ బర్త్ డే సందర్భంగా చంద్రబాబు ఫ్యామిలీ ఏటా స్వామివారిని దర్శించుకొని..స్వయంగా అన్నప్రసాదాలను వడ్డించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ నేపథ్యంలో ఇవాళ తిరుమలకు వెళ్లనున్న నారా ఫ్యామిలీ..రేపు తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో దేవాన్ష్ పేరుతో అన్నప్రసాదాలు అందించనున్నారు. ఆ తర్వాత తిరుమలలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు సీఎం చంద్రబాబు.




Total views : 223758