Wednesday, September 16, 2026
News Navigation
Wednesday, September 16, 2026
News Navigation

Breaking

Wednesday, September 16, 2026
Home Telangana పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు పోలింగ్‌ ప్రారంభం..

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు పోలింగ్‌ ప్రారంభం..

by Rama
MLC elections

ఉమ్మడి నల్లగొండ – వరంగల్‌- ఖమ్మం జిల్లాల ఎమ్మెల్సీ పట్టభద్రుల నియోజకవర్గ ఉప ఎన్నికలకు పోలింగ్‌ ప్రారంభమైంది. సాయంత్రం 4 గంటల వరకు ఈ పోలింగ్‌ జరగనుంది. ఈ ఎన్నికల్లో మూడు జిల్లాల్లో కలిపి 4,63,839 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఈ మేరకు ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తిచేసింది. మొత్తం 605 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ ఎన్నిక బ్యాలట్‌ పేపర్‌ ద్వారా నిర్వహిస్తారు. బరిలో మొత్తం 52 మంది అభ్యర్థులు ఉన్నారు. దీంతో పెద్ద సైజు బ్యాలెట్‌ పేపర్‌ వినియోగించారు. వీటికోసం జంబో బ్యాలెట్‌ బాక్సులను వినియోగిస్తున్నారు. మూడు వేల మంది సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు. పోలింగ్‌ సిబ్బందికి ఆదివారం ఎన్నికల సామాగ్రి అందించి ఆయా పోలింగ్‌ కేంద్రాలకు పంపించారు. ఒక పోలింగ్‌ కేంద్రంలో సగటున 800 మంది ఓటు హక్కు వినియోగించుకునే విధంగా పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటుచేశారు.

Follow us on : FacebookInstagramYouTube & Google News

పట్టణాలు, నియోజకవర్గ, మండల కేంద్రాల్లో పోలింగ్‌ సెంటర్లను ఏర్పాటు చేశారు. 283 పోలింగ్‌ కేంద్రాల్లో 800 మంది కంటే ఎక్కువగా ఓటర్లు ఉన్నారు. మొదట 600 పోలింగ్‌ కేంద్రాలే ఏర్పాటు చేయాలనుకున్నా.. భూపాలపల్లి జిల్లాలో మూడు, ములుగు జిల్లాల్లో రెండు పోలింగ్‌ కేంద్రాలను మారుమూల ప్రాంతాల ఓటర్ల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఈ ఎన్నికలో నోటా ఆప్షన్‌ ఉండదు. వచ్చే నెల 5న నల్లగొండ జిల్లా కేంద్రంలో ఓట్లను లెక్కించనున్నారు. ఎన్నికల ప్రశాంత నిర్వహణకు పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. గ్రాడ్యుయేట్‌ నియోజకవర్గ ఓటర్లుగా ఉన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సోమవారం స్పెషల్‌ క్యాజువల్‌ లీవ్‌గా ఎన్నికల కమిషన్‌ మంజూరు చేసింది. ప్రైవేటు సంస్థలు, కార్యాలయాల్లో పనిచేసే వారు ఓటు హక్కు వినియోగించుకునేలా పనివేళల్లో వెసులుబాటు కల్పించాలని ఆయా సంస్థలకు సూచించింది.

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్‌రెడ్డి.
    హైదరాబాద్ ఉప్పల్ భగాయత్‌లో ఆర్యవైశ్య ఆత్మగౌరవ భవన్‌కు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య సేవలను సీఎం రేవంత్‌రెడ్డి గుర్తు చేసుకున్నారు. ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చినా.. రోశయ్య మాత్రం తన ప్రత్యేకతను…
  • ‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కి థాంక్స్..
    ‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కి థాంక్స్.. యునానిమస్ బ్లాక్ బస్టర్ సెలెబ్రేషన్స్‌‌లో హీరో సూరి మంచి విజయాన్ని ఇచ్చిన ఆడియెన్స్‌కి థాంక్స్.. ‘మండాడి’ యునానిమస్ బ్లాక్ బస్టర్ సెలెబ్రేషన్స్‌‌లో హీరో సుహాస్ ఎల్రెడ్ కుమార్ సమర్పణలో ఆర్ఎస్…
  • నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.
    ఏపీలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా పర్యటిస్తున్నారు. విజయవాడకు చేరుకున్న కేంద్రమంత్రికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ఘన స్వాగతం పలికారు. రాష్ట్రంలో వైద్య మౌలిక వసతులను మరింత బలోపేతం చేసే దిశగా కీలక కార్యక్రమాలకు నడ్డా…
Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: