Sunday, May 31, 2026
News Navigation
Sunday, May 31, 2026
News Navigation

Breaking

Sunday, May 31, 2026
Home National తీవ్రత భూకంపంతో ఉలిక్కిపడిన అయోధ్య..

తీవ్రత భూకంపంతో ఉలిక్కిపడిన అయోధ్య..

by Satya
Earthquake

ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య నగరం ఆదివారం రాత్రి 1 గంట సమయంలో భూకంపంతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది. రిక్టర్ స్కేలుపై 3.6 తీవ్రతతో సంభవించిన ఈ భూకంపం స్థానికులను కలవరపరిచింది. అయోధ్యకు ఉత్తరాన 215 కిలోమీటర్ల దూరంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్టు ఎన్ఎస్‌సీ వెల్లడించింది. ప్రాణ, ఆస్తి నష్టం ఏమీ నమోదు కాలేదు. భారత కాలమానం ప్రకారం ఆదివారం రాత్రి 1 గంట 7 నిమిషాలకు ఇది సంభవించిందని, అక్షాంశం: 28.73, పొడవు: 82.26, లోతు: 10 కి.మీ అని వివరాలు వెల్లడించింది. కాగా శుక్రవారం తెల్లవారుజామున తీవ్ర భూకంపం నేపాల్‌ను వణికించిన విషయం తెలిసిందే. పెద్ద సంఖ్యలో ప్రాణనష్టం జరిగింది. ఈ ప్రకంపనలు భారత్‌లోని ఢిల్లీ రాజధాని ప్రాంతం, ఉత్తర భారత్‌లోని కొన్ని ప్రాంతాల్లో కనిపించిన విషయం తెలిసిందే.

Advertisements

You may also like

Our Visitor

019061
Total views : 89846

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.