Friday, September 11, 2026
News Navigation
Friday, September 11, 2026
News Navigation

Breaking

Friday, September 11, 2026
Home Andhra Pradesh విద్యార్థుల సామగ్రి కొనుగోలులో భారీ కుంభకోణం

విద్యార్థుల సామగ్రి కొనుగోలులో భారీ కుంభకోణం

by Satya
Nadendla Manohar

ఏపీలో విద్యార్థుల సామగ్రి కొనుగోలులో భారీ కుంభకోణం జరిగిందని నాదెండ్ల మనోహర్‌ ఆరోపించారు. ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు ఇచ్చే వస్తువుల నాణ్యత సరిగా లేదని జనసేన పీఏసీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ అన్నారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ఏడాది రూ.1,050 కోట్లతో విద్యార్థులకు బ్యాగులు, షూస్‌ కొనుగోలు చేశారన్నారు. 42 లక్షల మంది పేద విద్యార్థుల కోసం కొనుగోలు ఆర్డర్లు ఇచ్చారన్నారు. ఈ పథకం కింద మూడేళ్లలో సామగ్రికి 2400 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని వెల్లడించారు. టెండర్‌ ప్రక్రియలో ఐదు కంపెనీలు సిండికేట్‌గా ఏర్పడ్డాయని తెలిపారు. నిధులు దారి మళ్లినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విచారణలో తేలిందని వెల్లడించారు. గతేడాది ఫ్లాట్ ప్యానెల్స్ కు సంబంధించి నేటికీ డబ్బులు ఇవ్వలేదన్నారు. నాలుగు వందల కోట్ల రూపాయలతో ఫ్లాట్ ప్యానెల్స్ కొనుగోలు పేరిట మరో కుంభకోణం జరిగిందన్నారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: