70
బాపట్ల జిల్లా బాపట్ల పట్టణంలోని సూర్యలంక రోడ్డులో మీ సేవకు ఎదురుగా గణేష్ ప్లాజా నిర్వహిస్తున్నాడు. వల్లు గోపి వయసు 26 సంవత్సరాలు గత కొంతకాలంగా కుటుంబ కలహాల నేపథ్యంలో గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం చెరుకుపల్లి పోలీస్ స్టేషన్ లో ఇతనిపై భార్య అత్తమామలు కేసు పెట్టారు. ఆడపిల్ల పుట్టిందని వేధిస్తున్నాడని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నేను ఆడపిల్ల పుట్టిందని ఎప్పుడు నా భార్యను కొట్టలేదని ఒక సెల్ఫీ వీడియో తీసుకొని ఆ వీడియోలు తన అక్కకు స్నేహితులకు పంపించి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.