Thursday, June 18, 2026
News Navigation
Thursday, June 18, 2026
News Navigation

Breaking

Thursday, June 18, 2026
Home Latest News నూతన సీఎం ప్రమాణస్వీకారం.. రాజ్‌భవన్‌లో ఏర్పాట్లు

నూతన సీఎం ప్రమాణస్వీకారం.. రాజ్‌భవన్‌లో ఏర్పాట్లు

by
raj bhavan

తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వ ఏర్పాట్లుకు రంగం సిద్ధమైంది. సోమవారం సాయంత్రం తెలంగాణ రాజ్‌భవన్‌లో ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ప్రమాణ స్వీకరానికి కావాల్సిన సామ్రాగ్రిని కూడా తరలిస్తున్నారు. వివరాల ప్రకారం రాజ్‌భవన్‌ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి జీఏడీ ఏర్పాటు చేస్తోంది. రాజ్‌భవన్‌కు సామాగ్రి చేరుకుంటోంది. మూడు దిసెంలలో టెంట్లు, స్టాండ్స్, టేబుల్స్, కుర్చీలు, రెడ్ కార్పెట్లు, ఫర్నిచర్ చేరుకుంది. రాజ్ భవన్‌కు చేరుకున్న లైవ్ కవరేజ్ ఐ అండ్ పీఆర్ మీడియా. గవర్నర్‌ తమిళిసై ఏ క్షణంలోనైనా ఆదేశం ఇచ్చే అవకాశం ఉంది. మరోవైపు ఈరోజు మధ్యాహ్నం రెండు గంటలకు సీఈవో వికాస్‌రాజ్‌ రాజ్‌భవన్‌కు వెళ్లనున్నారు. ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థుల లిస్ట్‌ను గవర్నర్‌కు వికాస్‌రాజ్‌ అందజేయనున్నారు. ఇక, నివేదిక అందాక కొత్త శాసనసభ ఏర్పాటుకు గవర్నర్‌ గెజట్‌ నోటిఫికేషన్‌ ఇవ్వనున్నారు. సాయంత్రం నాలుగు గంటల తర్వాత పొలిటికల్‌ అపాయింట్‌మెంట్స్‌ అని రాజ్‌భవన్‌ వర్గాలు అంటున్నాయి.

Advertisements

You may also like

Our Visitor

025430
Total views : 147270

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.