Sunday, May 17, 2026
News Navigation
Sunday, May 17, 2026
News Navigation

Breaking

Sunday, May 17, 2026
Home Telangana జనసేన ఓటమిపై రామ్‌గోపాల్ వర్మ వ్యంగ్యాస్త్రాలు..!

జనసేన ఓటమిపై రామ్‌గోపాల్ వర్మ వ్యంగ్యాస్త్రాలు..!

by Satya
Ramgopal Varma

జనసేన పార్టీ, ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌పై అవకాశం చిక్కినప్పుడల్లా విమర్శలు గుప్పించే సినీ డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ మరోసారి వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ జనసేన పార్టీ ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోవడంపై సెటైర్లు వేశాడు. పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ టార్గెట్‌గా ఎక్స్ వేదికగా స్పందించాడు. ఆర్యభట్ట గణితశాస్ర్తంలో సున్నాని ఆవిష్కరించాడు. పవన్ కల్యాణ్ రాజకీయాల్లో సున్నాని కనిపెట్టాడు అంటూ ఆర్జీవీ ట్వీట్ చేశాడు. తెలంగాణ ఎన్నికల్లో జనసేన విఫలమైన నేపథ్యంలో రామ్‌గోపాల్ వర్మ ఈ విధంగా వ్యాఖ్యానించాడు. బీజేపీతో పొత్తుపెట్టుకుని తెలంగాణ ఎన్నికల్లో జనసేన పోటీ చేసింది. మొత్తం 8 స్థానాల్లో పోటీ చేయగా అన్ని చోట్లా డిపాజిట్లు కోల్పోయింది. కూకట్‌పల్లి నుంచి పోటీ చేసిన ముమ్మారెడ్డి ప్రేమ్‌కుమార్‌‌కు మాత్రమే చెప్పుకోదగ్గట్టుగా సుమారు 40 వేల ఓట్లు పడ్డాయి. మిగతా ఏడు చోట్ల అభ్యర్థులకు పెద్దగా ఓట్లు పడలేదు. కూకట్‌పల్లి‌తోపాటు ఖమ్మం, నాగర్‌కర్నూలు, కోదాడ, కొత్తగూడెం, వైరా, తాండూరు, అశ్వారావుపేట నియోజకవర్గాల్లో జనసేన తన అభ్యర్థులను బరిలోకి దింపింది. పవన్ కల్యాణ్‌తో పాటు బీజేపీ అగ్రనేతలు ప్రచారం చేసినా పెద్దగా ఓట్లు పడలేదు. దీంతో ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యర్థి పార్టీ అయిన వైఎస్సార్‌సీపీ ఇప్పటికే విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా రామ్‌గోపాల్ వర్మ కూడా ఇదే తరహాలో స్పందించాడు.

Read Also..

Read Also..

Advertisements

You may also like

Our Visitor

014128
Total views : 79105

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.