Sunday, July 12, 2026
News Navigation
Sunday, July 12, 2026
News Navigation

Breaking

Sunday, July 12, 2026
Home Devotional అయోధ్య ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి టీమిండియా స్టార్ క్రికెటర్…

అయోధ్య ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి టీమిండియా స్టార్ క్రికెటర్…

by Prakash
Virat Kohli Receives Invitation

ఈ నెల 22న అత్యంత వైభవోపేతంగా జరగనున్న అయోధ్య ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ హాజరవ్వడం ఖరారైనట్టు తెలుస్తోంది. ఈ మేరకు విరాట్ అభ్యర్థనను బీసీసీఐ పరిగణనలోకి తీసుకొని అనుమతి ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ నెల 21న ప్రాక్టీస్ సెషన్ అనంతరం కోహ్లీ టీమిండియా శిబిరం నుంచి బయలుదేరి మరుసటి రోజు అయోధ్య చేరుకోనున్నాడని క్రిక్‌బజ్ రిపోర్ట్ పేర్కొంది. ఈ మేరకు బీసీసీఐ నుంచి అనుమతి ఇచ్చిందని తెలిపింది. కాగా ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి ఆహ్వానం పొందిన క్రికెటర్లలో కోహ్లీతోపాటు మాజీ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోనీ‌తోపాటు పలువురు దిగ్గజాలు ఉన్నారు. భారత్ వర్సెస్ ఆఫ్ఘనిస్థాన్ మధ్య జరుగుతున్న 3 టీ20 మ్యాచ్‌లు ముగిసిన అనంతరం ఆటగాళ్లకి, సిబ్బందికి రెండు రోజుల విరామం లభిస్తుంది. అనంతరం ఇంగ్లండ్‌తో జరగనున్న 5 టెస్టుల సిరీస్‌‌కు సన్నాహలు మొదలుకానున్నాయి. తొలి టెస్టుకు వేదికైన హైదరాబాద్ చేరుకొని టీమిండియా ఆటగాళ్లు ప్రాక్టీస్ చేయాల్సి ఉంది. అయితే ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి వెళ్తుండడంతో కోహ్లీ ఒక రోజు ప్రాక్టీస్ సెషన్‌కు దూరం కానున్నాడు.

Advertisements

You may also like

Our Visitor

039821
Total views : 200934

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: