Monday, September 14, 2026
News Navigation
Monday, September 14, 2026
News Navigation

Breaking

Monday, September 14, 2026
Home Andhra Pradesh ఉష శ్రీచరణ్‌కు నిరసన సెగ

ఉష శ్రీచరణ్‌కు నిరసన సెగ

by Satya
Usha Sricharan

శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గంలో ఆత్మీయ పలకరింపు నిర్వహిస్తున్న మంత్రి ఉష శ్రీచరణ్‌కు పెనుకొండ మండలంలోని మోటువారిపల్లిలో నిరసన సెగ తాకింది. ఆదివారం ఆమె హరిపురం, కురుబవాండ్లపల్లి, మోటువారిపల్లి గ్రామాల్లో ఆత్మీయ పలకరింపు నిర్వహించారు. తమ గ్రామానికి తారు రోడ్డు, తాగునీటి సౌకర్యం కల్పించాలని మోటువారిపల్లి గ్రామస్థులు మంత్రిని కోరారు. తెదేపా హయాంలో రూ.3.42 కోట్లతో తారురోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేసి శిలాఫలకం వేశారని, ప్రభుత్వం మారాక ఐదేళ్లనుంచి పనులు ప్రారంభించలేదని వాపోయారు. సమస్యను సావధానంగా వినకుండానే మంత్రి వెళ్లిపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. తాగునీరు, తారురోడ్డు సౌకర్యం కల్పించకపోతే వచ్చే ఎన్నికలను బహిష్కరిస్తామని హెచ్చరించారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: