Thursday, June 4, 2026
News Navigation
Thursday, June 4, 2026
News Navigation

Breaking

Thursday, June 4, 2026
Home Telangana రేణుకా చౌదరికి రాజ్యసభ సీటు..!

రేణుకా చౌదరికి రాజ్యసభ సీటు..!

by Satya
Renuka Chaudhary

తెలుగు ఆడపడుచు, ఫైర్ బ్రాండ్ కేంద్ర మాజీమంత్రి రేణుకా చౌదరి మరోసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు. తెలంగాణ నుంచి రేణుకాచౌదరి పేరును ఖరారు చేశారు. హైకమాండ్ కూడా ఆమెకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కాసేపట్లో నామినేషన్ దాఖలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణ నుంచి కాంగ్రెస్‌కు రెండు రాజ్యసభ సీట్లు ఉన్నాయి. ఇందులో ఒకటి రేణుకాచౌదరికి ఇవ్వగా మరో సీటు ఏఐసీసీకి రిజర్వ్ చేస్తూ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. దీనికి ఏఐసీసీ నుంచి అజయ్ మాకెన్ లేదా సుప్రియలలో ఎవరో ఒకరు తెలంగాణ నుంచి రాజ్యసభ సీటు దక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక రేణుకా చౌదరి ఖమ్మం నుంచి పోటీ చేస్తారని తెలుస్తోంది. మొదటి నుంచీ ఆమె ఖమ్మం పార్లమెంట్ స్థానం పైనే ఫోకస్ చేసారు. సోనియా వస్తారు. కమ్మం నుంచి పోటీ చేస్తారు అన్న టాక్ నడవడంతో కొన్నాళ్ళు దాన్ని పక్కన పెట్టారు. అప్పుడు కూడా సోనియా తప్పుకుంటే ఖమ్మం నుంచి పోటీ చేసే హక్కు తనకు మాత్రమే ఉందని రేణుకా చౌదరి హాట్ కామెంట్స్ చేశారు.

Read Also..

మరిన్నితాజావార్తలకోసంఇక్కడ క్లిక్ చేయండి.

Follow us on : FacebookInstagram & YouTube.

Advertisements

You may also like

Our Visitor

020367
Total views : 92792

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.