Saturday, September 12, 2026
News Navigation
Saturday, September 12, 2026
News Navigation

Breaking

Saturday, September 12, 2026
Home Crime రామగుండం మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం

రామగుండం మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం

by Prakash
Ramagundam
రామగుండం మెడికల్ కాలేజ్(Ramagundam):

పెద్దపల్లి జిల్లా (Peddapalli District) రామగుండం మెడికల్ కాలేజీ బాయ్స్ హాస్టల్‌లో జూనియర్ మెడికో స్టూడెంట్ ను సీనియర్లు కొందరు ర్యాగింగ్ చేయడం కలకలం సృష్టించింది. ఈ సంఘటనపై హాస్టల్‌లో గొడవ జరగడంతో పోలీసులు వెళ్లి విచారణ జరిపారు. జూనియర్ మెడికో తల వెంట్రుకలు, మీసాలను ట్రిమ్మర్ తో ఇష్టానుసారంగా కట్ చేసి, ర్యాగింగ్ చేసినట్లు సమాచారం.

Follow us on : Facebook, Instagram & YouTube.

దీనిపై సదరు స్టూడెంట్ కుటుంబ సభ్యులు కాలేజ్ ప్రిన్సిపల్ కు ఫిర్యాదు చేశారు. అయితే కాలేజీ ర్యాగింగ్ నిరోధక కమిటీ ఆధ్వర్యంలో మేడికో విద్యార్థులు, పోలీసుల మధ్య రహస్యంగా మీటింగ్ జరుగుతున్నట్లు తెలిసింది. కొందరు జూనియర్ విద్యార్థులు మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ హిమబిందు సింగ్ కు ఫిర్యాదు చేసినట్లు, విచారణ అనంతరం రుజువైతే తగిన చర్యలు తీసుకుంటామని ప్రిన్సిపల్ అంటున్నారు. కాగా ఈ సంఘటన జిల్లా వ్యాప్తంగా సంచలనం రేపుతుంది.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • ఢిల్లీ వేదికగా 18వ బ్రిక్స్‌ శిఖరాగ్ర సదస్సు.
    పుతిన్‌కు కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్‌ సింగ్‌ ఢిల్లీలో స్వాగతం పలికారు. ఉక్రెయిన్‌ యుద్ధం ప్రారంభమైన 2022 తర్వాత రష్యా వెలుపల జరుగుతున్న బ్రిక్స్‌ సదస్సుకు పుతిన్‌ స్వయంగా హాజరవడం ఇదే తొలిసారి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై…
  • పోలాండ్‌లో రోబోల వినూత్న నిరసన.
    పోలాండ్‌ రాజధాని వార్సాలో జరిగిన ఓ వినూత్న నిరసన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది. సెప్టెంబర్‌ 7న హ్యూమనాయిడ్‌, క్వాడ్రుపెడ్‌ రోబోలు వీధుల్లో మార్చ్‌ నిర్వహించాయి. పోలాండ్‌ డిజిటల్‌ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యాలయం ఎదుట రోబోలు జెండాలు ఊపుతూ, నినాదాలు…
  • నవీ ముంబైలో ‘మహా గణేష్ మూర్తి వర్క్‌షాప్‌’.
    గణేశ్ చతుర్థి వేడుకలకు ముందే మహారాష్ట్రలో పర్యావరణ హిత గణపతి విగ్రహాల తయారీపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. నవీ ముంబైలో రాష్ట్ర ప్రభుత్వ పర్యావరణ, వాతావరణ మార్పుల శాఖ ఆధ్వర్యంలో జరిగిన ‘మహా గణేష్ మూర్తి వర్క్‌షాప్‌’లో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్…
Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: