Wednesday, August 26, 2026
News Navigation
Wednesday, August 26, 2026
News Navigation

Breaking

Wednesday, August 26, 2026
Home Andhra Pradesh టీడీపీలో కలకలం..!

టీడీపీలో కలకలం..!

by Satya
TDP

ఏలూరు జిల్లా ఉండి టీడీపీలో కలకలం రేగింది. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మళ్లీ రామరాజుకే కేటాయిస్తూ తొలి జాబితా విడుదల చేశారు. దీంతో ఈ స్థానంపై ఆశపెట్టుకున్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే కలవపూడి శివరామరాజు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. టీడీపీకి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఉండి నుంచి 2009, 2014 ఎన్నికల్లో టీడీపీ తరపున శివరామరాజు గెలుపొందారు. అయితే 2019లో రామరాజుకు ఆ స్థానం కేటాయించడంతో వైసీపీపై అభ్యర్థిపై ఆయన గెలుపొందారు.

ప్రధాన మోదీ విశాఖ పర్యటన రద్దు..!

ఈ సారి ఎన్నికల్లో తనకే సీటు వస్తుందని శివ భావించారు. కానీ రెండోసారి కూడా రామరాజుకే చంద్రబాబు అవకాశం కల్పించడంతో శివరామరాజు మనస్థాపం చెందారు. టీడీపీకి రాజీనామా చేసే యోచనలో ఉన్నారని ఆయన వర్గీయులు చెబుతున్నారు. ఉండి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం తర్వాత ఒక్కసారి కూడా గెలవలేదు. ఈ సారైనా గెలవాలనే లక్ష్యంగా ఆ పార్టీ ఉంది. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీలో ఏర్పడిన వర్గ విభేదాలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్లస్ అవుతాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Follow us on : Facebook, Instagram & YouTube.


తెలంగాణలో ఆగస్టు 27న ఓటరు రోల్ సభలు.
తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ.. ఎస్‌ఐఆర్ ప్రక్రియలో భాగంగా ఈ నెల 27న …
ఐపీఎస్‌ అధికారి ఎన్‌.సంజయ్‌పై క్రమశిక్షణ చర్యలకు ఏపీ ప్రభుత్వం శ్రీకారం.
సస్పెన్షన్‌లో ఉన్న ఐపీఎస్‌ అధికారి ఎన్‌.సంజయ్‌పై క్రమశిక్షణ చర్యలకు ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. గతంలో …
ఏపీ లోకాయుక్త జస్టిస్‌గా తల్లాప్రగడ మల్లికార్జునరావు ప్రమాణం.
ఆంధ్రప్రదేశ్ లోకాయుక్త జస్టిస్‌గా తల్లాప్రగడ మల్లికార్జునరావు ప్రమాణ స్వీకారం చేశారు. విజయవాడలో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ …

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: