Sunday, July 12, 2026
News Navigation
Sunday, July 12, 2026
News Navigation

Breaking

Sunday, July 12, 2026
Home Film ఎన్‌.శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో మూడు హిస్టారిక‌ల్ వెబ్ సీరీస్‌లు…

ఎన్‌.శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో మూడు హిస్టారిక‌ల్ వెబ్ సీరీస్‌లు…

by Prakash
N. Shankar

తెలంగాణ సాయిధ పోరాటం నుండి, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వరకు.. డైరెక్టర్ N. Shankar మొదటి వెబ్ సీరీస్‌…


తెలంగాణ సాయిధ పోరాటంలో ప్ర‌జ‌లే, సైనికులుగా యుద్ధం చేయాల్సి వచ్చిన ప‌రిస్థితులు, భూస్వామ్య వ్య‌వ‌స్థ లో సామాన్యుల మీద జరిగిన దాడులు. ప్రజలు, ముఖ్యంగా మహిళల ప్రతిఘటన మొద‌లుకుని, తెలంగాణ ప్రాంతం ఇండియన్ యూనియన్ లో కలపబడటం. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఏర్పడటం. ఆ త‌రువాత జ‌రిగిన ప‌రిణామాలు, పాలకుల నిర్ణయాలు. రాజకీయ, సామాజిక, ఆర్థిక అసమానతలు, ప్రజల తరఫున ఉద్య‌మాలు, విప్ల‌వపార్టీల భావజాలం తో పాటు, ప్ర‌జాస్వామ్య బ‌ద్దంగా జ‌రిగిన పోరాటాల కొనసాగింపు గ, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం, జరిగిన పోరాట నేపథ్యం. తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డేంత వ‌ర‌కు, తెలంగాణ స‌మాజంలో , ఉద్యమాల్లో జ‌రిగిన ఆటుపోట్లు, కవులు కళాకారులు మేధావులు పంచిన చైత‌న్యం, విద్యార్థుల, యువకుల త్యాగాలు, ప్రజల భాగస్వామ్యం, నిష్పక్షపాతంగా, ప్రజల కోణం లో అర్థవంతంగా, చూపించాల‌నే సంక‌ల్పంతో ఈ వెబ్‌ సీరీస్‌ కు శ్రీ‌కారం చుడుతున్నాం. అక్టోబ‌ర్ నుంచి షూటింగ్ మొదలవుతుంది..

Follow us on : Facebook, Instagram & YouTube.

మ‌హాత్మ జ్యోతీరావు పూలే స్ఫూర్తితో…రెండ‌వ వెబ్‌ సీరీస్…


మ‌హాత్మ జ్యోతీరావు పూలే అనుభ‌వాలు, ఆయ‌న జీవితంలో జ‌రిగిన సంఘ‌ట‌న‌లు, సంఘ‌ర్ష‌ణ‌లు (ఆయ‌న బ‌యోగ్ర‌ఫీ కాదు) పేదలకు, మ‌హిళ‌లకు విద్యను భోదించటం కోసం, తన సతీమణి సావిత్రిబాయి గారి ద్వారా త‌న సంకల్పానికి శ్రీకారం చుట్టి, ఆనాటి దురాచారాల పట్ల తిరుగుబాటు చేసిన క్రమం లో ,ఆయ‌న ఎదుర్కొన స‌మ‌స్య‌లు, అవ‌మానాలు, త్యాగాలు, ఆయ‌న జ్క్షానం, ఆయ‌న చేసిన భోద‌న కథాంశంగా రెండవ వెబ్ సీరీస్‌.

మూడో వెబ్ సీరీస్‌ బాబా సాహెబ్ అంబేద్క‌ర్ Dr. Babasaheb Ambedkar (బ‌యోగ్ర‌ఫీ కాదు)

ఆయ‌న ఈ దేశానికి ‌, అట్ట‌డుగు ప్ర‌జ‌ల‌కు, అణ‌గారిన వ‌ర్గాల‌కు ఇచ్చిన గొప్ప రాజ్యాంగ స్ఫూర్తిని , ఆయ‌న వ్య‌క్తిగ‌త జీవితంలో అనుభ‌వించిన బాధ‌ల‌ను, తన ధృడ సంకల్పం, వ్య‌క్తి నుండి వ్య‌వ‌స్థ‌గా తను మారడానికి మద్య జరిగిని సంఘర్షణలు ఇతి వృత్తంగా మూడో వెబ్ సిరీస్ వర్క్ జరుగుతుంది..

మ‌హాత్మ జ్యోతిరావు పూలేతో పాటు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ల వెబ్‌సీరీస్‌ లు వారి బ‌యోగ్ర‌ఫీలు కాదు. వారి జీవితాల్లో జ‌రిగిన సంఘ‌ట‌న‌లు, ప్ర‌జ‌ల ప‌ట్ల వాళ్ల కున్న‌ క‌మిట్‌మెంట్‌, స‌మాజంలో స‌మాన‌త‌ల కోసం వారు చేసిన నిజాయితీ పోరాటం, వారి నిజ జీవితంలో జ‌రిగిన సంఘ‌ర్ష‌ణ‌లు, వారు పొందిన అవ‌మానాలు, గౌర‌వాలు, ఇలా అన్ని ఈ త‌రం వారికి తెలియ‌జెప్పాల‌నే ల‌క్ష్యంతో ఈ వెబ్‌సీరీస్ ‌లు చేస్తున్నాం.

ఈ మూడు వెబ్‌సీరీస్‌ల‌ను కూడా పూర్తి ఆస‌క్తిక‌రంగా వుండే విధంగా హిందీ, తెలుగు భాష‌ల్లో నిర్మిస్తాం. మూడు సంవ‌త్స‌రాల నుండి మా టీమ్‌తో క‌లిసి ఈ క‌థ‌ల‌పై వ‌ర్క్ చేస్తున్నాం. పూర్తి వివరాలతో, త్వరలో మీ ముందుకు వస్తాం – N. Shankar

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


హ్యారీ బ్రూక్ విధ్వంసం.. భారత్‌పై ఇంగ్లండ్ ఘన విజయం.
వావ్! హ్యారీ బ్రూక్ మరియు అతని జట్టు నుంచి ఇది నిజంగా అద్భుతమైన ప్రదర్శన. ఇన్నింగ్స్ …
రైతులను ఇబ్బంది పెట్టొద్దు-మంత్రి జూపల్లి.
రైతులు అన్నం పెట్టే దేవుళ్ళతో సమానం, వారిని ఇబ్బంది కలిగించకూడదని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.. …
బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన కేంద్రమంత్రి జేపీ నడ్డా.
యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ …


Advertisements

You may also like

Our Visitor

039780
Total views : 200816

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: