Saturday, May 16, 2026
News Navigation
Saturday, May 16, 2026
News Navigation

Breaking

Saturday, May 16, 2026
Home Telangana తాగునీటి కోసం మహిళలు రోడ్డుపై ధర్నా..

తాగునీటి కోసం మహిళలు రోడ్డుపై ధర్నా..

by Prakash
Women Darna

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వరావుపేట మండలం, కొత్తూరు గ్రామంలో త్రాగునీరు సరఫరా లేదంటూ ఖాళీ బిందెలతో గ్రామస్తులు రోడ్డెక్కారు. గత నాలుగు నెలలుగా మిషన్ భగీరథ మోటర్లు పనిచేయక నీటి సరఫరా లేక త్రాగునీరు కోసం ఇబ్బంది పడుతున్న ఏ అధికారి తమ వంక చూడలేదని ఆగ్రహంతో ధర్నాకు దిగారు. రోడ్డుపై టెంట్ వేసి రోడ్డుకి అడ్డంగా కర్రలు పెట్టి మహిళలు ధర్నాకి దిగడంతో రోడ్డుకి ఇరువైపులా వాహనాలు భారీగా నిలిచిపోయాయి. వేసవి రాకముందే ఇన్ని ఇక్కట్లు ఉంటే వేసవిలో మరింత ఇబ్బంది ఉంటుందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే అధికార యంత్రాంగం స్పందించి త్రాగునీరు సరఫరా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. తమ సమస్య తీరేవరకు ధర్నా విరమించేది లేదని గ్రామస్తులు తెలుపుతున్నారు.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

ఇది చదవండి: ఏప్రిల్ నెలలో ఎన్నికలు జరగడం ఖాయం..


తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్
తెలంగాణలో వచ్చే నెల 15 నుంచి ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ప్రక్రియ ప్రారంభమవుతుందని రాష్ట్ర …
నల్గొండ జిల్లా మిర్యాలగూడలో విషాదం..
నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం ఊట్లపల్లి శివారులో విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు బోరు గుంతలో …
వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని ప్రభుత్వ మాతా శిశు సంరక్షణ ఆసుపత్రి లో వైద్యుల పర్యవేక్షణ లోపించింది.
వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని ప్రభుత్వ మాతా శిశు సంరక్షణ ఆసుపత్రి లో వైద్యుల పర్యవేక్షణ …

CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

013952
Total views : 78645

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.