Saturday, June 13, 2026
News Navigation
Saturday, June 13, 2026
News Navigation

Breaking

Saturday, June 13, 2026
Home National బెంగళూరులో బాంబు పేలుడు..!

బెంగళూరులో బాంబు పేలుడు..!

by Satya
Bomb blast in Bengaluru

బెంగళూరు(Bangalore)లోని రామేశ్వరం కేఫ్‌(Rameswaram Cafe)లో బాంబు పేలుడుకు సంబంధించిన పోలీసులు తాజాగా నిందితుడిని గుర్తించారు. కేఫ్‌లో పెట్టిన బాంబు పేలడంతో 10 మంది గాయాలపాలయ్యారు. ఐఈడీ కారణంగా ఈ పేలుడు సంభవించిందని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య తెలిపారు. బాంబు ఉన్న బ్యాగ్‌ను నిందితుడు కేఫ్‌లో వదిలివెళ్లినట్టు చెప్పారు. కాగా, సీసీటీవీ ఫుటేజీ సాయంతో నిందితుడిని గుర్తించినట్టు ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ తెలిపారు. అతడి వయసు 28 – 30 ఏళ్లు ఉండొచ్చని అన్నారు.

ఇది చదవండి: మీ ఈ-కేవైసీ అయ్యిందా ? లేదా ?

రవ్వ ఇడ్లీ కోసం కౌంటర్‌లో కూపన్ తీసుకున్న నిందితుడు అది తినకుండానే తన బ్యాగ్‌ను అక్కడ వదిలేసి వెల్లిపోయాడని చెప్పారు. ఇక ఘటనా స్థలంలో మరే ఇతర బాంబులు లభించలేదని పోలీసులు తెలిపారు. నిందితుడికి టోకెన్ జారీ చేసిన క్యాషియర్‌ను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఇది ఉగ్రవాద చర్యేనా? కాదా? అన్న విషయం ఇప్పుడే చెప్పలేమని ముఖ్యమంత్రి సిద్దరామయ్య చెప్పారు. ఇదేమీ భారీ పేలుడు కాదని అన్నారు. ఘటనలో కేఫ్ సిబ్బందితో పాటు ఓ కస్టమర్ గాయపడ్డాడని తెలిపారు. అయితే, వారి ప్రాణానికి ప్రమాదం ఏమీ లేదని వెల్లడించారు. కాగా, ఘటనపై కేసు నమోదైంది.

Follow us on : FacebookInstagram, YouTube & Google News


మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


పశ్చిమబెంగాల్: ఈవీఎంలు భద్రపరిచిన భవనంలో అగ్నిప్రమాదం..
పశ్చిమబెంగాల్‌లో ఈవీఎంలు భద్రపరిచిన భవనంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో సుమారు 4 వేలకు పైగా ఈవీఎంలు …
మీనాక్షీ నటరాజన్‌కు సుప్రీంకోర్టు షాక్‌..
సుప్రీంకోర్టులో మీనాక్షి నటరాజన్‌కి చుక్కెదురైంది. మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్‌ను రిటర్నింగ్ ఆఫీసర్ తిరస్కరించడంతో ఆమె …
పశ్చిమ దేశాలకు విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ గట్టి కౌంటర్.
రష్యాతో భారత్‌ కొనసాగిస్తున్న ఇంధన, వ్యూహాత్మక సంబంధాలపై పశ్చిమ దేశాలు చేస్తున్న విమర్శలకు విదేశాంగ మంత్రి …

CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి.


Advertisements

You may also like

Our Visitor

023199
Total views : 141435

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.