Saturday, May 16, 2026
News Navigation
Saturday, May 16, 2026
News Navigation

Breaking

Saturday, May 16, 2026
Home Andhra Pradesh ఘనంగా నిర్వహించిన అర్జునుడు ప్రధమ వర్ధంతి…

ఘనంగా నిర్వహించిన అర్జునుడు ప్రధమ వర్ధంతి…

by Rama
Arjuna's first death anniversary was celebrated grandly

జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఉమ్మడి కృష్ణా జిల్లా మాజీ అధ్యక్షులు, మాజీ శాసనమండలి సభ్యులు బచ్చుల అర్జునుడు ప్రధమ వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ముందుగా అర్జునుడి చిత్రపటానికి రాష్ట్ర పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి లుక్కా సాయిరాం ప్రసాద్ గౌడ్, రాష్ట్ర పార్టీ కార్యదర్శి కొత్త నాగేంద్ర కుమార్ (నాగబాబు), రాష్ట్ర బీసీ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి వీరంకి వెంకట గురుమూర్తిలు పూల మాలవేసి ఘనంగా నివాళులర్పించారు.

Follow us on : FacebookInstagramYouTube & Google News

అనంతరం గురుమూర్తి మాట్లాడుతూ… బచ్చుల అర్జునుడి గారి రాజకీయ జీవితం సాధారణ కార్యకర్తగా, మచిలీపట్నం పట్టణ ప్రధాన కార్యదర్శిగా, మచిలీపట్నం పట్టణ అధ్యక్షునిగా, పిఎసిఎస్ అధ్యక్షునిగా, కేడీసీసీ బ్యాంకు వైస్ చైర్మన్ గా, మచిలీపట్నం మున్సిపల్ చైర్మన్ గా, ఉమ్మడి కృష్ణాజిల్లా అధ్యక్షులుగా రెండు పర్యాయాలు, శాసనమండలి సభ్యునిగా, తెలుగుదేశం పార్టీ గన్నవరం నియోజకవర్గ ఇంచార్జ్ గా బడుగు బలహీన వర్గాల తరఫున అన్ని పదవులు చేసిన మహానుభావుడు అన్నారు. తన వాణి ని అన్నిచోట్ల వినిపించిన వ్యక్తి ఆని, మనస్ఫూర్తిగా అన్నా అని పిలిపించుకునే వ్యక్తి అర్జునుడు గారు అన్నారు.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

013925
Total views : 78459

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.