Monday, September 14, 2026
News Navigation
Monday, September 14, 2026
News Navigation

Breaking

Monday, September 14, 2026
Home Latest News రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వర్షాలు…

రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వర్షాలు…

by Prakash
Yellow alert

తెలంగాణలో రానున్న ఐదు రోజుల పాటు ఈదురు గాలులతో కూడిన వడగండ్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్ర హెచ్చరించింది. ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వెల్లడించింది. సోమవారం నుంచి మంగళవారం ఉదయం వరకు నిర్మల్, రాజన్న సిరిసిల్ల, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, జగిత్యాల, భూపాలపల్లి జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షాలు పడే అవకాశం ఉందని… హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. మంగళవారం నుంచి బుధవారం వరకు సంగారెడ్డి, వికారాబాద్, నల్గొండ, కరీంనగర్, కామారెడ్డి, మెదక్, ఆదిలాబాద్, మహబూబ్ నగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, రంగారెడ్డి, హైదరాబాద్, మల్కాజ్ గిరి, నారాయణపేట, వనపర్తి, నాగర్ కర్నూల్, జోగులాంబ గద్వాల జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. బుధవారం నుంచి శుక్రవారం వరకు రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: