Sunday, September 13, 2026
News Navigation
Sunday, September 13, 2026
News Navigation

Breaking

Sunday, September 13, 2026
Home Telangana మందమర్రిలో 40000/- విలువగల గంజాయి పట్టివేత…

మందమర్రిలో 40000/- విలువగల గంజాయి పట్టివేత…

by Prakash
mandamarri ganja gang arrested

మంచిర్యాల జిల్లా, మందమర్రి(Mandamarri)

మందమర్రి పోలీస్ స్టేషన్ పరిధిలోని చెంచు కాలనికి చెందిన ఆవుల షారుక్ (19)అనే యువకుడు గంజాయి తరలిస్తుండగా పట్టుకున్న టాస్క్ఫోర్స్ పోలీసులు.

ఆవుల షారుక్ అనే యువకుడు చెంచు కాలనీ సమీపంలోని రైల్వే ట్రాక్ వద్ద గంజాయి తరలిస్తున్నారని సమాచారం మేరకు తనిఖీలు నిర్వహించగా అతని వద్ద 1100 గ్రాముల గంజాయి లభ్యమైనది. ఆ యువకుడిని విచారించగా, గత కొంతకాలంగా తన సోదరుడు లాడెన్ తో కలిసి ఈ వ్యాపారం కొనసాగిస్తున్నానని తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలని ఉద్దేశంతోటి మహారాష్ట్రలోని(Maharashtra) చంద్రపూర్ నుంచి గంజాయిని తక్కువ ధరకు తీసుకువచ్చి ఇక్కడ అమ్ముతున్నట్లు తెలిపారు.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

మారుతి నగర్ కు చెందిన మక్కల గంగాధర్ (18) అనే యువకుడు చెంచు కాలనీ సమీపంలో గంజాయి అమ్ముతున్నట్లు సమాచారం రావడంతో మందమర్రి ఎస్సై రాజశేఖర్ సిబ్బందితో తనిఖీలు నిర్వహించగా అతని వద్ద 500 గ్రాముల గంజాయి లభ్యమయింది. ఇరువురిపై వేరువేరుగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజశేఖర్ తెలిపారు.

మందమర్రి సర్కిల్ ఇన్స్పెక్టర్ శశిధర్ రెడ్డి(Shasidhar Reddy) మాట్లాడుతూ, రామగుండం కమిషనర్ ఆఫ్ పోలీస్, మరియు మంచిర్యాల డిసిపి గారి ఆదేశాల మేరకు గంజాయి అమ్మే వాళ్ళు అదేవిధంగా తాగే వాళ్లపై ఎల్లప్పుడూ నిఘా ఉంచుతూ, వాళ్లపైన చట్ట ప్రకారం కఠినమైన చర్యలు తీసుకుంటామని, విద్యాసంస్థల నందు ఎన్డిపిఎస్ చట్టం గురించి విస్తృతంగా అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేయడంతో పాటు విద్యార్థులను చైతన్యవంతులను చేసి భవిష్యత్తులో వారు వారి సహచరులు మాదకద్రవ్యాలను వినియోగించకుండా కాపాడాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని తెలిపారు. అందరూ డ్రగ్ కి బానిసలు కారు.. చేడు వ్యసనాలకి కానీ కొన్ని పరిస్థితుల ప్రభావం వల్ల జల్సాలకు అలవాటు పడి డబ్బు సంపాద‌నే ప్రధాన లక్ష్యంగా చేసుకుని జీవించే కొన్ని అసాంఘిక శక్తుల వల్ల యువత పెడదారి పడుతున్నదని తెలియజేశారు. తల్లిదండ్రుల ఆశయాలను తుంగలోద్దెక్కి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు అన్నారు.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కి థాంక్స్..
‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కి థాంక్స్.. యునానిమస్ బ్లాక్ బస్టర్ సెలెబ్రేషన్స్‌‌లో …
నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.
ఏపీలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా పర్యటిస్తున్నారు. విజయవాడకు చేరుకున్న కేంద్రమంత్రికి ముఖ్యమంత్రి చంద్రబాబు …
మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో మోదీ భేటీ.
బ్రిక్స్ ఇండియా 2026 సదస్సు నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ, మలేషియా ప్రధాని అన్వర్ …

CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: