Friday, July 10, 2026
News Navigation
Friday, July 10, 2026
News Navigation

Breaking

Friday, July 10, 2026
Home Andhra Pradesh సమస్యలను తెలిపేందుకు ఇదే సువర్ణ అవకాశం…

సమస్యలను తెలిపేందుకు ఇదే సువర్ణ అవకాశం…

by Prakash
Prajagalam


ఈ నెల 27న పలమనేరులోటీడీపీ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా ప్రజా గళం (Prajagalam)..

ఈనెల 27న పలమనేరులో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా చేపట్టబోతున్న ప్రజాగళం (Prajagalam) యాత్ర జరగనుందని మాజీ మంత్రి అమర్నాథరెడ్డి తెలిపారు. పలమనేర్ పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శనివారం నియోజకవర్గం ముఖ్య నేతలతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….. రాష్ట్రంలోనే మొట్టమొదటగా ప్రజాగళం కార్యక్రమం పలమనేరు నియోజకవర్గంలో జరగనుందన్నారు. ఈ కార్యక్రమం పలమనేరు నియోజకవర్గ ప్రజలకు ఓ సువర్ణ అవకాశంగా ఆయన అభివర్ణించారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకొని విజయవంతం చేయాలని ఆయన కోరారు.

పలమనేరు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి – నియోజకవర్గ సమావేశంలో మాజీ మంత్రి అమర్నాధ రెడ్డి..

ప్రజా గళం కార్యక్రమంలో నియోజకవర్గ సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేకంగా గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. భవిష్యత్తులో చంద్రబాబుతోనే రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం సాధ్యమనే నమ్మకంతో చాలామంది తెలుగుదేశం పార్టీ వైపు మొగ్గు చూపుతుండడం శుభ పరిణామమని రానున్న ఎన్నికలలో ఉమ్మడి పార్టీ నేతల గెలుపు రాష్ట్ర భవిష్యత్ కోసం అవసరమని ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పెద్దపంజాణి మండలం పెద్ద వెలగటూరు పంచాయతీ సంపల్లికి చెందిన పలువురు వైకాపా యువత అమరనాథ రెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వారికి ఆయన కండువాలు వేసి సాధరంగా ఆహ్వానించారు.

Follow us on : FacebookInstagramYouTube & Google News

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


సాయికృష్ణ కేసులో కీలక పరిణామం.
సాయికృష్ణ కేసులో సీఐ నాగరాజు కస్టడీకి సంబంధించి ఏపీ హైకోర్టు జారీ చేసిన ఆదేశాలను సిట్ …
అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే.
నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలోని వరికుంటపాడు మండలం పెద్దిరెడ్డిపల్లి గ్రామంలో నిర్వహించిన శ్రీ అంకాలమ్మ తల్లి …
ముంబైకి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ నేడు మరోసారి ముంబైకి వెళ్లనున్నారు. కొంతకాలంగా రొటేటర్ కఫ్ …

CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

039450
Total views : 196880

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: