Wednesday, September 16, 2026
News Navigation
Wednesday, September 16, 2026
News Navigation

Breaking

Wednesday, September 16, 2026
Home National కేరళ ప్రభుత్వం సంచలన నిర్ణయం..!

కేరళ ప్రభుత్వం సంచలన నిర్ణయం..!

by Satya
Mohammed Khan and Draupadimurmu


మహ్మద్‌ఖాన్, ద్రౌపదిముర్ముపై సుప్రీంకోర్టు(Supreme Court)లో రిట్ పిటిషన్ దాఖలు..

కేరళ ప్రభుత్వం(Kerala Govt) సంచలన నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను ఆమోదించకుండా ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తున్నారంటూ గవర్నర్ అరిఫ్ మహ్మద్‌ఖాన్, రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను ఆమోదించకుండా తమ వద్ద పెట్టుకోవడం ద్వారా సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా ప్రవరిస్తున్నారని, దీనిని రాజ్యాంగ విరుద్ధ చర్యగా ప్రకటించాలని కోరింది. యూనివర్సిటీ చట్టాల సవరణ బిల్లు- 2022, కేరళ(Kerala) సహకార సంఘాల సవరణ బిల్లు-2022తోపాటు మరో మూడు బిల్లులు కలిపి మొత్తం 7 ఆమోదించిన అసెంబ్లీ వాటిని గవర్నర్‌కు పంపింది.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

గవర్నర్ వాటిపై సంతకం పెట్టకుండా రాష్ట్రపతి పరిశీలన కోసం పంపారు. దీనిని కేరళ ప్రభుత్వం తీవ్రంగా తప్పుబట్టింది. ఆమోదించకపోవడానికి ఎలాంటి కారణం లేకుండానే రాష్ట్రపతి జాప్యం చేస్తున్నారని, దీనిని రాజ్యాంగ విరుద్ధ చర్యగా ప్రకటించాలని సుప్రీంకోర్టును కోరింది. గవర్నర్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని తన రిట్‌పిటిషన్‌(Repetition)లో కోరింది. అరిఫ్‌ఖాన్‌(Arif Khan)పై పిటిషన్‌‌(Petition)లో గవర్నర్‌ను, గవర్నర్ కార్యాలయ అదనపు ప్రధాన కార్యదర్శిని ప్రతివాదులుగా పేర్కొంది.

ఇది చదవండి: అర‌వింద్‌ కేజ్రీవాల్ అరెస్టుపై తీవ్రంగా స్పందించిన భార‌త్‌


మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


నవీ ముంబైలో ‘మహా గణేష్ మూర్తి వర్క్‌షాప్‌’.
గణేశ్ చతుర్థి వేడుకలకు ముందే మహారాష్ట్రలో పర్యావరణ హిత గణపతి విగ్రహాల తయారీపై అవగాహన కార్యక్రమం …
తమిళనాడు సీఎం విజయ్ పాలనపై స్టాలిన్ ఫైర్.
తమిళనాడు రాజకీయాల్లో అధికార, విపక్షాల మధ్య విమర్శలు మరింత తీవ్రంగా మారుతున్నాయి. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌పై …
ఢిల్లీ వేదికగా 18వ బ్రిక్స్‌ శిఖరాగ్ర సదస్సు.
భారత్‌ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 18వ బ్రిక్స్‌ శిఖరాగ్ర సదస్సు సెప్టెంబర్‌ 12, 13 తేదీల్లో …

CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: