Monday, June 1, 2026
News Navigation
Monday, June 1, 2026
News Navigation

Breaking

Monday, June 1, 2026
Home National కర్ణాటకలోని చిత్రదుర్గలో దారుణం..!

కర్ణాటకలోని చిత్రదుర్గలో దారుణం..!

by Satya
Atrocity in Karnataka's Chitradurga

కర్ణాటక(Karnataka)లో మ్యాచుల బెట్టింగులకు అలవాటు పడ్డ దర్శన్ భారీ నష్టం..

క్రికెట్(Cricket) బెట్టింగుల(Betting) వ్యసనం ఓ ప్రభుత్వోద్యోగి జీవితాన్ని ఛిన్నాభిన్నం చేసింది. అప్పుల బాధ తాళలేక అతడి భార్య 23 ఏళ్ల చిన్న వయసులోనే ఆత్మహత్య చేసుకుంది. కర్ణాటకలో వెలుగు చూసిన ఈ ఉదంతం ప్రస్తుతం సంచలనంగా మారింది. దర్శన్, రంజితలకు 2020లో వివాహం జరిగింది. రాష్ట్ర మైనర్ ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్‌లో దర్శన్ అసిస్టెంట్‌ ఇంజినీర్‌గా పని చేస్తున్నాడు. ఐపీఎల్ క్రికెట్ మ్యాచు(IPL Cricket Match)ల బెట్టింగులకు అలవాటు పడ్డ దర్శన్ భారీగా నష్టపోయాడు. నష్టం వచ్చిన ప్రతిసారీ అప్పుచేసి మరీ బెట్టింగులకు దిగడంతో కోటి మేర అప్పులు పేరుకుపోయాయి. ఈ నేపథ్యంలో అప్పుల వాళ్ల వేధింపులు భరించలేకపోయిన రంజిత ఇటీవల చిత్రదుర్గలోని తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పెళ్లైన ఏడాదికి తన భర్త బెట్టింగుల వ్యసనం రంజితకు తెలిసిందని ఆమె తండ్రి వెంకటేశ్ తెలిపారు. అప్పులు ఇచ్చిన వారి వేధింపులు తాళలేక తన కూతురు ఆత్మహత్య చేసుకుందని ఆరోపించారు. తన ఫిర్యాదులో రుణాలిచ్చిన 13 మంది పేర్లు ప్రస్తావించారు. బెట్టింగుల్లో సులువుగా డబ్బులు సంపాదించొచ్చంటూ నిందితులు తన అల్లుడిని ఉచ్చులోకి దింపారని ఆరోపించారు. అతడికి బెట్టింగులు అంటే ఇష్టం లేదు. సులువుగా డబ్బు సంపాదించేందుకు ఇదే సరైనా మార్గం అంటూ నిందితులే అతడిని బలవంతంగా ఉచ్చులోకి దింపారు. బ్లాంక్ చెక్కు షూరిటీగా తీసుకుని బెట్టింగులకు కావాల్సిన డబ్బులు ఇచ్చారు అని ఆయన ఆరోపించారు.

Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇది చదవండి: Save Democracy : ఈ నెల 31న ఢిల్లీలో ‘సేవ్ డెమోక్రసీ’ నినాదంతో భారీ ర్యాలీ..


ఛార్‍థామ్ యాత్రలో తీవ్ర ట్రాఫిక్ జామ్ …
ఉత్తరాఖండ్‌లో చార్‌ధామ్ యాత్రకు భక్తులు పోటెత్తడంతో వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి. చార్‌ధామ్‌ యాత్రలో భాగంగా బద్రీనాథ్‌ …
రాజస్థాన్‌లో రాకాసి ఇసుక తుపాను బీభత్సం..
రాజస్థాన్‌లో రాకాసి ఇసుక తుపాను బీభత్సం సృష్టించింది. చురు జిల్లాలో ఇసుక తుపాన్‌తో పాటు భారీ …
సీబీఎస్‌ఈ రీవాల్యుయేషన్‌ పోర్టల్‌పై సైబర్‌ దాడి..
సీబీఎస్‌ఈ రీవాల్యుయేషన్‌ ప్రక్రియలో సైబర్‌ దాడి కలకలం రేపింది. రీవాల్యుయేషన్‌ ఫీజుల చెల్లింపులకు ఉపయోగిస్తున్న పోర్టల్‌ …

CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

019370
Total views : 90577

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.