శ్రీ సత్యసాయిజిల్లా పెనుకొండ మండలం కోనాపురం, కొండాపురం గ్రామానికి చెందిన రైతు కుటుంబీకులైన జోన్నల బాబన్న, బురెడ్డి నరసప్ప లకు చెందిన 31,40 ఎకరాల భూమి యర్రమంచి పోలంలో సర్వేనెంబర్ 68 లో ఉంది, ఈ భూమి లో నలుగురు భాగస్తులకు సంబందించిన 62,80 ఎకరాల భూమి ఉందని, ఇందులో రెండు కుటుంబాలకు చెందిన 31,40 ఎకరాల భూమిని మంగళవారం చదునుపనులు చేపట్టామని, ఈ పనులు చేస్తుండగ తెదెపాకు చెందిన దత్తారెడ్డి ఈ భూమీ తనదని, ఈ భూమిలో ఎ పనులు చేయకూడదంటూ నానా హంగామ చేయడమే కాకుండ రాజకీయ రంగు పుసారని, అసలు మంత్రీ ఉషశ్రీకి సంబంధమేలేని ఈ భూమిని పచ్చ మీడియాలో మంత్రీ పై నిందలు వేయడం పద్దతికాదన్నారు.
బుధవారం ఈ భుమికి సంబందించిన రైతులు మీడీయాతో సమావేశం నిర్వహించి వారి భూమికి సంబందించిన పత్రాలు, ఆధారాలు చూపించి కోర్టు తమ భూమి తమకు ఇచిందని, 2006 ఓ భాగస్తుడైన నాగిరెడ్డిగారి వెంకటరెడ్డి కుటుంబీకులకు హైవే అవార్డు డిక్లరేషన్ చేసి వారికి నష్టపరిహరం ఇచ్చిందన్నారు, ఈ 31,40 ఏకరాల భూమి మా సొంతం అని, దీనిని అనవసర రాజకీయం చేస్తే సహించేది లేదని, ఈ భుమీ తనదే అని ఆధారాలు చూపిస్తే ఈ క్షణమే మేము ఇక్కడి నుండి వెళ్ళిపోతామని దత్తారెడ్డికి సవాల్ విసిరారూ రైతులు, ఈ సమావేశంలో వెంకటరమనరెడ్డి, రవీంద్రరెడ్డి, నరసిరెడ్డి, దిలీప్ రెడ్డి, గొపాల్ రెడ్డి, లక్ష్మినారాయణరెడ్డి, ముత్యాలరెడ్డి, అంజినరెడ్డి, శంకర్ రెడ్డి, శ్రీనివాసరెడ్డి తదితరులూ పాల్గోన్నారు.
ఇది చదవండి: మంత్రి ఉషశ్రీ అండతో రెచ్చిపోతున్న వైసిపి నాయకులు..
Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి