సత్యంతో సహవాసం చేస్తే భగవంతుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని, అసత్యాన్ని పట్టుకు వేలాడితే శాపాలు వెంటాడతాయని డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి (Dr. Satti Suryanarayana reddy) అన్నారు. తాను దంపత సమేతంగా చేసిన సత్య ప్రమాణం ఫలితాన్ని అందించిన బిక్కవోలు శ్రీ లక్ష్మీ గణపతి స్వామి (Sri lakshmi ganapathi swamy) వారిని డాక్టర్ సూర్యనారాయణరెడ్డి, శ్రీమతి ఆదిలక్ష్మి (Smt adilakshmi)దంపతులు గురువారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సత్య ప్రమాణంపై లక్ష్మీ గణపతి స్వామి వారు తమ శక్తిని ప్రదర్శించారని, దీనికి తోడు అనపర్తి గ్రామ దేవత శ్రీ వీరుళ్ళమ్మ అమ్మవారి మహత్యం ప్రకటితం అయ్యిందన్నారు. తను ఎవరిని విమర్శించడానికి ఈ వ్యాఖ్యలు చేయడం లేదని, తనకు కేవలం భగవంతుడిపై గల విశ్వాసాన్ని ప్రకటిస్తున్నానన్నారు. బిక్కవోలు లక్ష్మీ గణపతి స్వామివారిని దర్శించుకున్న వారిలో డాక్టర్ సూర్యనారాయణరెడ్డి, శ్రీమతి ఆదిలక్ష్మి దంపతులతో బాటు తమ్మిరెడ్డి నాగ శ్రీనివాసరెడ్డి, జంగా గంగాధర్ రెడ్డి, బుద్దాల కన్నారావు, వంగ రామకృష్ణారెడ్డి, గువ్వల సత్తిరెడ్డి, కుప్పెల శ్రీనివాసు, పులిమి శ్రీనివాస్, పాపదాసు మురళి, వంగా సుబ్బారావు, తాళ్ల నిరంజన్ రెడ్డి, పల్లి లక్ష్మణరావు, బ్రహ్మదేవం శ్రీను, కడవల శ్రీను, తదితరులు ఉన్నారు.
ఇది చదవండి: ప్రారంభమైన రెండో రోజు మేమంతా సిద్ధం యాత్ర..
Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి