Saturday, May 16, 2026
News Navigation
Saturday, May 16, 2026
News Navigation

Breaking

Saturday, May 16, 2026
Home Telangana Kishan Reddy : కేంద్రంలో కాంగ్రెస్ వస్తే మత కల్లోలాలు, కర్ఫ్యూలే..!

Kishan Reddy : కేంద్రంలో కాంగ్రెస్ వస్తే మత కల్లోలాలు, కర్ఫ్యూలే..!

by Satya
Kishan Reddy

కేంద్రంలో కాంగ్రెస్(Congress) ప్రభుత్వం వస్తే కనుక దేశవ్యాప్తంగా మతకల్లోహాలు, కర్ఫ్యూలే ఉంటాయని కేంద్రమంత్రి, తెలంగాణ రాష్ట్ర(Telangana State) బీజేపీ(BJP) అధ్యక్షుడు కిషన్ రెడ్డి(Kishan Reddy) అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్ని వర్గాల ప్రజలను బెదిరిస్తున్నారని ఆరోపించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు, కాంట్రాక్టర్లు. ఇలా అందరినీ బెదిరించి ట్యాక్స్ వసూలు చేస్తున్నారన్నారు. సికింద్రాబాద్‌(Secunderabad)లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తెలంగాణ నుంచి ఢిల్లీకి వందల కోట్ల రూపాయలు పంపిస్తున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ అంటేనే కరప్షన్ అన్నారు.

ఇది చదవండి: కాంగ్రెస్ లో ఏక్ నాథ్ షిండేలు లేదన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

అలాంటి కాంగ్రెస్ తెలంగాణలో తెచ్చిన మార్పు ఇదేనా? అని నిలదీశారు. ఇండియా కూటమిలో ఐకమత్యం లేదన్నారు. ప్రతిపక్ష కూటమి అధికారంలోకి వస్తే మూడు నెలలకు ఓ ప్రధానమంత్రి మారడం ఖాయమని ఎద్దేవా చేశారు. కలగూర గంపతో కూడిన పార్టీలు అధికారంలోకి వస్తే దేశ ఆర్థిక వ్యవస్థ, దేశ భవిష్యత్తు దెబ్బతింటుందని హెచ్చరించారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మరోసారి మోదీ నాయకత్వంలో బీజేపీ గెలవాలన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు ఏమయ్యాయో చెప్పాలన్నారు. ఢిల్లీలో కాంగ్రెస్ గెలిస్తే మరోసారి కుటుంబ పాలన వస్తుందన్నారు.

Follow us on : FacebookInstagram, YouTube & Google News


మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


Advertisements

You may also like

Our Visitor

013924
Total views : 78447

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.