డిజిటల్ యుగంలో సోషల్ మీడియానే అందరికి సర్వస్వంగా మారిపోయింది. అయితే సోషల్ మీడియా(Social Media)ను ఉపయోగించే వారు ఎంతో కొంత నైపుణ్యం, టెక్నికల్ నాలెడ్జ్ ఉంటే బెటర్. ఎందుకంటే అప్ డేట్ అవుతున్న సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ ను ఎప్పటికప్పుడు ఫాలో అవుతూ ఉండాలి. ఇందులో ముఖ్యమైనది ఇన్‌స్టాగ్రామ్(Instagram) ఇందులో కంటెంట్ గ్యాప్ ఉంది. ఈ సమస్యను పరిష్కరించడానికి మిమ్మల్ని ఒకేసారి ఎక్కువ పోస్టులను డిలీట్ చేయడానికి లేదా ఆర్కైవ్ చేయడానికి అనుమతిస్తుంది. ఒకేసారి ఎక్కువ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌ల(Instagram posts)ను తొలగించడం లేదా ఆర్కైవ్ చేయడం ఎలా ఇప్పుడు తెలుసుకోండి.
ఇది చదవండి: మీ మొబైల్‌లో చార్జింగ్ త్వరగా తగ్గిపోతుందా..?
ముందుగా మొబైల్‌లో యాప్‌ని ఓపెన్ చేయాలి. స్క్రీన్ కుడి వైపు కింద ఉన్న ఐకాన్ బటన్‌పై క్లిక్ చేసి ప్రొఫైల్‌ను క్రియేట్ చేయాలి. తర్వాత మెనూలోకి ఎంటరై కుడి వైపున కింద ఉన్న మూడు చుక్కలపై క్లిక్ చేయాలి. ఇప్పుడు ‘మీ యాక్టివిటీ’ ఆప్షన్‌లో ఇప్పుడు రెండవ లైన్‌లో ‘ఫోటో మరియు వీడియో’ ఎంపికను ఎంచుకోండి. అన్ని పోస్ట్‌లను చూడాలి. ‘పోస్ట్’ బటన్‌పై క్లిక్ చేయాలి. యూజర్ తొలగించాలనుకుంటున్న పోస్ట్‌లను సెలక్ట్ చేసుకొని ఫిల్టర్ సెలక్షన్ ను క్లిక్ చేయాలి. పోస్ట్ పూర్తయిన తర్వాత మీరు పైన కుడి వైపున ఉన్న ‘సెలెక్ట్’ ఎంపికపై క్లిక్ చేయాలి. ఇప్పుడు మీరు వినియోగదారు కోరుకునే ‘ఆర్కైవ్’ లేదా ‘డిలీట్’ ఎంపికపై క్లిక్ చేయాలి.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.