శ్రీశైలం (Srisailam):
శ్రీశైలంలో మల్లికార్జునస్వామి పరమ భక్తులలో ఒకరైన శివశరణి అక్కమహాదేవి జయంతోత్సవం (Akkamahadevi Jayantotsavam) దేవస్థానం సాంప్రదాయబద్ధంగా నిర్వహించింది. జయంతోత్సవం సందర్భంగా అర్చకులు ఆలయ ఈవో పెద్దిరాజు ఆలయ ప్రాంగణంలోని అక్కమహాదేవి విగ్రహానికి పంచామృత, జలాభిషేకలు నిర్వహించారు ముందుగా జయంతోత్సవ సంకల్పాన్ని పఠించి, మహాగణపతి పూజ, మల్లికా గుండంలోని శుద్ధ జలాలతో, జలాభిషేకం, పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. విశేష పూజలు నిర్వహించి పుష్పాంజలి సమర్పించారు. 12వ శతాబ్దంలో కన్నడ ప్రాంతాన శివశరణిగా ప్రసిద్ధి పొందిన అక్కమహాదేవి శ్రీమల్లికార్జునుడిపై సంస్కృత, కన్నడ భాషలలో ఎన్నో వచనాలు చెప్పింది. అందుకే కర్ణాటక భక్తులు ఎక్కువగా ఆరాధిస్తారు. దీనితో శ్రీశైలం దేవస్థానం ప్రతి సంవత్సరం అక్కమహాదేవి జయంతోత్సవం విశేష పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- కడప జిల్లా పులివెందులలో నీటి సమస్యలపై బి.టెక్ రవి విమర్శలు..కడప జిల్లా పులివెందులలో రాజకీయ హీట్ పెరుగుతోంది.ఇద్దరు ముఖ్యమంత్రులను అందించిన ఈ నియోజకవర్గంలో ఇప్పటికీ తాగునీటి సమస్యలు కొనసాగుతున్నాయని టీడీపీ ఇంచార్జి బి.టెక్ రవి విమర్శించారు.ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా పులివెందుల పట్టణంలోని క్రిస్టియన్ వీధిలో పెన్షన్లు ఆయన…
- కలగానే మిగిలిన సొంతింటి కల..పార్వతీపురం మన్యం జిల్లాలోని పార్వతీపురం, సాలూరు నియోజకవర్గాల్లో పేదల సొంతింటి కల ఇంకా అటకెక్కే ఉంది. గత ప్రభుత్వ హయాంలో పార్వతీపురం మండలం అడ్డాపుశిల, సాలూరు మున్సిపాలిటీ పరిధిలో భారీ ఎత్తున టిడ్కో ఇళ్లను నిర్మించారు. మొత్తం 1,983 మంది లబ్ధిదారులకు…
- కుప్పం ఎయిర్‌పోర్టు భూసేకరణకు మార్గం సుగమం..కుప్పం విమానాశ్రయ భూసేకరణకు మార్గం సుగమమైంది. 150 ఎకరాల సేకరణ నోటిఫికేషన్లపై జోక్యం చేసుకోబోమని సుప్రీం కోర్టు తెలిపింది. భూసేకరణను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను ఇటీవల ఏపీ హైకోర్టు కొట్టేసింది. దీంతో ఉన్నత న్యాయస్థానం తీర్పుపై పలువురు సుప్రీం కోర్టులో…
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి




Total views : 61816