విజయవాడకు సుజనా చౌదరి (Sujana Chowdary) పక్కా లోకల్ అని, 30వేల ఓట్ల మెజారిటీతో పశ్చిమలో ఎన్డీఏ గెలుపు ఖాయమని పశ్చిమ బీజేపీ నేతలు జోస్యం చెప్పారు. వైసీపీ నేతలకు వార్నింగ్ ఇచ్చారు. ఓటమి భయంతోనే వైసీపీ నేతలు దుష్ప్రచారం చేస్తోందని దుయ్యబట్టారు. పోతిన మహేష్ వైసీపీ నుంచి ప్యాకేజీ తీసుకుని ఎన్డీఏకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నా, ఎవరూ నమ్మే స్థితిలో లేరని బీజేపీ నేతలు అన్నారు. సుజనా చౌదరి నాన్ లోకల్ అని జరుగుతున్న ప్రచారాన్ని బీజేపీ నాయకులు ఖండించారు. భవానీపురం బీజేపీ కార్యాలయంలో ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్, సీనియర్ నేతలు పైలా సోమినాయుడు, పోతిన వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. సుజనా చౌదరి భారీ మెజారిటీతో గెలవడం ఖాయమని అడ్డూరి శ్రీరామ్ జోస్యం చెప్పారు. ప్రలోభాలకు నగరాలు లొంగుతున్నారన్న ఆరోపణలను శ్రీరామ్ తీవ్రంగా ఖండించారు. ఇష్టం వచ్చినట్లు ఆరోపణలు చేస్తే సహించేది లేదని వైసీపీ నేతలను శ్రీరామ్ హెచ్చరించారు. సుజనా ఇప్పటికే ప్రజల మనసు గెలుచుకున్నారన్నారు. సుజనా పక్కా లోకల్ అని పైలా సోమినాయుడు అన్నారు. సుజనా స్వగ్రామం విజయవాడకు కూతవేటు దూరంలోనే ఉందని, ఆయన తండ్రి విజయవాడ పాల ప్రాజెక్ట్ లో ఇంజనీర్ గా పనిచేశారని, సుజనా కుటుంబాలు విజయవాడ లోనే ఉన్నాయని పైలా గుర్తు చేశారు. వైసీపీ అభ్యర్థి ఆసిఫ్ కు రాజకీయ అవగాహన లేదని, ఆయన వ్యాఖ్యలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని సోమినాయుడు అన్నారు. విజన్ ఉన్న నాయకుడు సుజనా అని, అందుకే తాము ఆయనకు మద్దతు పలికామని చెప్పారు. పోతిన మహేష్ మాటలను ఎవరూ పట్టించుకోరని, ఆయన మాటలకు విలువలేదని వెంకటేశ్వరరావు దుయ్యబట్టారు. ఈ సమావేశంలో పోతిన బేస్ కంఠేశ్వరుడు, రాంపిల్ల శ్రీను, బెవర శ్రీను, పీసా కుట్టి పాల్గొన్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- అనంతపురం జిల్లాలో ఆర్‌ఎంపీ డాక్టర్ల దందా..ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఆర్ ఎం పి డాక్టర్ల దందా మూడు పువ్వులు ఆరు కాయలు చందంగా తయారైంది . అత్యవసర వేళలో ప్రథమ చికిత్స చేసి ప్రాణాలు నిలబెట్టాల్సిన ఆర్ఎంపీ డాక్టర్లు ఏకంగా ఎంబిబిఎస్ డాక్టర్లతో సమానంగా తెలిసి తెలియని…
- అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణ పనులకు శ్రీకారం..రాజధాని అమరావతిలో భారీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ. బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణ పనులను ఆయన ప్రారంభించారు.అమరావతిలో 21 ఎకరాల విస్తీర్ణంలో, సుమారు 750 కోట్ల వ్యయంతో 1000 పడకల సామర్థ్యంతో ఈ…
- కడప జిల్లా పులివెందులలో నీటి సమస్యలపై బి.టెక్ రవి విమర్శలు..కడప జిల్లా పులివెందులలో రాజకీయ హీట్ పెరుగుతోంది.ఇద్దరు ముఖ్యమంత్రులను అందించిన ఈ నియోజకవర్గంలో ఇప్పటికీ తాగునీటి సమస్యలు కొనసాగుతున్నాయని టీడీపీ ఇంచార్జి బి.టెక్ రవి విమర్శించారు.ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా పులివెందుల పట్టణంలోని క్రిస్టియన్ వీధిలో పెన్షన్లు ఆయన…





Total views : 61960