Sunday, July 26, 2026
News Navigation
Sunday, July 26, 2026
News Navigation

Breaking

Sunday, July 26, 2026
Home TelanganaMedak ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్యాయత్నం

ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్యాయత్నం

by Rama
sangareddy

సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ పెద్ద చెరువులో ఈ ఘటన చోటు చేసుకుంది. సీఐ నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం చందానగర్ కు చెందిన శ్వేత, విద్యాధర్ రెడ్డి భార్యభర్తలిద్దరూ సాప్ట్ వేర్ ఉద్యోగులు. వీరికి మూడేళ్ల వయసు గల ఒక పాప శ్రీహా, శ్రీ హాన్స్ కవలపిల్లలు. భార్యభర్తలిద్దరి మధ్య గొడవలు జరగడంతో తన ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి శ్వేత నిన్న రాత్రి స్కూటీపై అమీన్ పూర్ పెద్ద చెరువుకు వచ్చారు. తన పిల్లలతో కలిసి ఒక్కసారిగా చెరువులో దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. పెట్రోలింగ్ చేస్తున్న హెడ్ కానిస్టేబుల్ జానకిరామ్, కానిస్టేబుల్ ప్రభాకర్ గుర్తించి తల్లి, పాపను ప్రాణాలతో బయటకు తీశారు. చెరువులో మునిగిపోయిన బాబు శ్రీహన్స్ కోసం గాలించగా ఈ రోజు ఉదయం మృతదేహం లభ్యమైంది. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం పటాన్ చెరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు‌. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టనున్నట్లు సీఐ నాగరాజు తెలిపారు.

Follow us on : FacebookInstagramYouTube & Google News


  • నెల్లూరు : వెంకటాచలం మండలం పల్లె వీక్షణలో ఎమ్మెల్యే సోమిరెడ్డి.
    నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలో నిర్వహించిన పల్లె వీక్షణ కార్యక్రమంలో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను పరిశీలించారు. జిల్లా కలెక్టర్ శుక్లతో కలిసి గ్రామాల్లో పర్యటించిన ఎమ్మెల్యే… ప్రజలకు అందుతున్న సేవలు,…
  • మంగళగిరిలో కాపర్ వైర్ చోరీ ముఠాను అరెస్టు చేసిన పోలీసులు.
    గుంటూరు జిల్లా మంగళగిరిలో నిర్మాణంలో ఉన్న భవనాలను లక్ష్యంగా చేసుకుని విద్యుత్ వైర్లను చోరీ చేస్తున్న ముఠాను గ్రామీణ పోలీసులు అరెస్టు చేశారు. కాజా టోల్‌గేట్ సమీపంలోని ప్రభల్ టెక్ పార్క్‌లో చోరీకి గురైన ఎలక్ట్రికల్ వైర్ల కేసును ఛేదించిన పోలీసులు…
  • ఏలూరు జిల్లాలో మెగా పేరెంట్స్, టీచర్స్ మీట్‌కు విస్తృత ఏర్పాట్లు.
    ఏలూరు జిల్లాలో ఈ నెల 24న నిర్వహించనున్న మెగా పేరెంట్స్–టీచర్స్ మీట్‌కు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. జిల్లాలోని 1,772 ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలలు, 20 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఈ కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించనున్నట్లు జిల్లా…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


Advertisements

You may also like

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: