Friday, August 28, 2026
News Navigation
Friday, August 28, 2026
News Navigation

Breaking

Friday, August 28, 2026
Home Telangana కార్పొరేటర్ నుండి కేంద్ర మంత్రి దాకా ఎదగడం బీజేపీలోనే సాధ్యం

కార్పొరేటర్ నుండి కేంద్ర మంత్రి దాకా ఎదగడం బీజేపీలోనే సాధ్యం

by Satya
కార్పొరేటర్ నుండి కేంద్ర మంత్రి దాకా ఎదగడం బీజేపీలోనే సాధ్యం

తనకు కేంద్ర మంత్రి పదవి దక్కడం కరీంనగర్ ప్రజలతోపాటు కార్యకర్తలు పెట్టిన భిక్షేనని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. ‘‘కార్యకర్తలారా… ఆనాడు నాతో కలిసి మీరు కేసీఆర్ మూర్ఖపు పాలనపై పోరాడితే లాఠీదెబ్బలు తిన్నరు. కేసులు ఎదుర్కొన్నారు. జైళ్లకు వెళ్లారు. రక్తం చిందించారు. ప్రజా సంగ్రామ యాత్రలో నాతో కలిసి అడుగులో అడుగు వేసుకుంటూ కష్టాలను లెక్క చేయకుండా 155 రోజులపాటు 1600 కిలోమీటర్లకుపైగా నడిచారు. పార్టీ బలోపేతం కోసం ఎంతో కష్టపడ్డారు. అందుకే ఈరోజు కార్పొరేటర్ నుండి కేంద్ర మంత్రి దాకా ఎదగడం బీజేపీలోనే సాధ్యం నాకీ పదవి వచ్చింది. ఈ పదవి మీరు పెట్టిన భిక్షే. ప్రజలకు, కార్యకర్తలకే ఈ పదవిని అంకితమిస్తున్నా’’అని పేర్కొన్నారు. కేంద్ర మంత్రిగా తొలిసారి కరీంనగర్ కు విచ్చేసిన బండి సంజయ్ కు అడుగడుగునా అపూర్వ స్వాగతం లభించింది. ఈ సందర్భంగా కరీంనగర్ లో మీడియాతో బండి సంజయ్ మాట్లాడారు… ఏమన్నారంటే…

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టాక తొలిసారి కరీంనగర్ కు వచ్చాను. ఈ సందర్భంగా కరీంనగర్ కు, తెలంగాణ రాష్ట్రానికి సెల్యూట్ చేస్తున్నా. ఈ పదవి వచ్చిందంటే కరీంనగర్ ప్రజలు పెట్టిన భిక్షే. ప్రజలు ఓట్లేసి భారీ

Follow us on : Facebook, Instagram, YouTube & Google News

  • చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ వచ్చేనెలలో భారత్‌కి వచ్చే ఛాన్స్‌.
    దాదాపు ఏడేళ్ల తర్వాత చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ భారత్‌లో పర్యటించే అవకాశం కనిపిస్తోంది. వచ్చే నెల 12, 13 తేదీల్లో ఢిల్లీలో జరగనున్న బ్రిక్స్ సదస్సులో ఆయన పాల్గొనే అవకాశమున్నట్లు సమాచారం. 2019లో చివరిసారిగా భారత్‌కు వచ్చిన షీ జిన్‌పింగ్,…
  • పశ్చిమగోదావరి జిల్లా సముద్రంలో బోటు బోల్తా.
    పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండలం చిన్నలంక వద్ద సముద్రంలో బోటు బోల్తా పడిన ఘటన కలకలం రేపింది. సముద్ర వేటకు వెళ్లిన బోటు.. ఇసుకదిబ్బను ఢీకొనడంతో ఒక్కసారిగా బోల్తా పడింది. బోటులో ఉన్న ఏడుగురు మత్స్యకారులు సముద్రంలోకి దూకి.. ఈదుకుంటూ ఒడ్డుకు…
  • 22ఏపై బీజేపీ దీక్షలు.
    భూ భారతి పేరుతో పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నాయని బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. సెక్షన్ 22ఏ కింద లక్షలాది ఎకరాల భూములను ప్రొహిబిటెడ్ జాబితాలో చేర్చి రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని విమర్శించారు. ధరణి పోర్టల్‌పై నిర్వహించిన…
  • సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.
    సూర్యాపేట జిల్లా కోదాడ మండలం ద్వారకుంట సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్‌ నుంచి ఏలూరు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.. ముందు వెళ్తున్న కంటైనర్‌ను అత్యంత వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందగా..…
  • భారత సైన్యం చేతికి ‘షేర్’.. ఏకే-203 రైఫిళ్లు రెడీ.
    రక్షణ రంగంలో ఆత్మనిర్భరత దిశగా భారత్ మరో కీలక ముందడుగు వేసింది. ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ జిల్లా కోర్వాలోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో దేశీయంగా తయారైన ఏకే-203 అసాల్ట్ రైఫిళ్లు భారత సైన్యానికి అందించేందుకు సిద్ధమయ్యాయి. త్వరలోనే వీటి డెలివరీ ప్రారంభం కానుంది. అత్యాధునికమైన…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: