హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి పై దారిదోపిడి దొంగలు రెచ్చిపోతున్నారు. నేషనల్ హైవే 65 పై రాత్రి సమయంలో ఒంటరిగా కనిపించిన వాహనాలే టార్గెట్ గా దారి దోపిడీలకు పాల్పడుతున్నారు. రోడ్డు పక్కన ఆగిఉన్న వాహనదారులను కత్తులు, రాడ్ల తో బెదిరిస్తూ,లొంగక పోతే హత్యలు చేస్తూ డబ్బు, బంగారం దోపిడీ చేస్తున్నారు.. గత రెండు నెలలుగా ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తూ పోలీసులకు సవాల్ విసురుతున్న పార్థ అంతరాష్ట్ర దొంగల ముఠా ఆట కట్టించారు నల్గొండ పోలీసులు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై దారి దోపిడిలమహారాష్ట్ర పార్థ గ్యాంగ్ ను అరెస్ట్ చేసిన పోలీసులు మరింత సమాచారం మా నల్గొండ ప్రతినిధి వెంకట్ రెడ్డి అందిస్తారు.
పుతిన్‌కు కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ ఢిల్లీలో స్వాగతం పలికారు. ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన 2022 తర్వాత రష్యా వెలుపల జరుగుతున్న బ్రిక్స్ సదస్సుకు పుతిన్ స్వయంగా హాజరవడం ఇదే తొలిసారి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై…
పోలాండ్ రాజధాని వార్సాలో జరిగిన ఓ వినూత్న నిరసన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది. సెప్టెంబర్ 7న హ్యూమనాయిడ్, క్వాడ్రుపెడ్ రోబోలు వీధుల్లో మార్చ్ నిర్వహించాయి. పోలాండ్ డిజిటల్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యాలయం ఎదుట రోబోలు జెండాలు ఊపుతూ, నినాదాలు…
గణేశ్ చతుర్థి వేడుకలకు ముందే మహారాష్ట్రలో పర్యావరణ హిత గణపతి విగ్రహాల తయారీపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. నవీ ముంబైలో రాష్ట్ర ప్రభుత్వ పర్యావరణ, వాతావరణ మార్పుల శాఖ ఆధ్వర్యంలో జరిగిన ‘మహా గణేష్ మూర్తి వర్క్‌షాప్’లో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్…
మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నాందేడ్ జిల్లాలో వ్యాన్, ట్రక్కు ఢీకొన్న ఘటనలో ఆరుగురు మృతి చెందారు. మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. వేగంగా వెళ్తున్న వాహనాలు ఢీకొనడంతో ప్రమాదం జరిగినట్లు సమాచారం. ప్రమాద తీవ్రతకు వాహనాలు తీవ్రంగా…
ఏపీలో వాతావరణశాఖ భారీ వర్షాలపై హెచ్చరికలు జారీ చేసింది. రెండు రోజులపాటు తొమ్మిది జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. విశాఖ, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, మార్కాపురం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. ఆయా ప్రాంతాల్లో…