యాదాద్రి భువనగిరి జిల్లాచౌటుప్పల్ లో BJP విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర కోశాధికారి శాంత కుమార్, ఉపాధ్యక్షుడు గంగిడి మనోహర్ రెడ్డి, భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, జిల్లా అధ్యక్షుడు మరియు పలు మండలాల అధ్యక్షులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో పలు తీర్మానాలకు ఆమోదం తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల సమీపిస్తున్నాయని. అందువలన మండలాల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు గడపగడపకు వెళ్లి ప్రచారం నిర్వహించాలని శాంతకుమార్ కోరారు. మొన్న జరిగిన సాధారణ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ పైనున్న కోపంతో కాంగ్రెస్ పార్టీకి ఓటేశారని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం రాదని, తెలంగాణలో బిజెపి పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్నారు. ప్రతి ఒక్కరు కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రజల వద్దకు చేరుతున్నాయా లేదా విచారించాలని శాంతకుమార్ ఆదేశించారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- ఐపీఎస్ అధికారి ఎన్.సంజయ్‌పై క్రమశిక్షణ చర్యలకు ఏపీ ప్రభుత్వం శ్రీకారం.సస్పెన్షన్‌లో ఉన్న ఐపీఎస్ అధికారి ఎన్.సంజయ్‌పై క్రమశిక్షణ చర్యలకు ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. గతంలో ఆయన అగ్నిమాపకశాఖ, సీఐడీ విభాగాల్లో విధులు నిర్వర్తించారు. సర్వీసు నిబంధనలు, క్రమశిక్షణ ఉల్లంఘనలపై ప్రభుత్వం రాతపూర్వక వివరణ కోరగా సంజయ్ ఇవ్వలేదు. దీంతో ఆయనపై…
- ఏపీ లోకాయుక్త జస్టిస్‌గా తల్లాప్రగడ మల్లికార్జునరావు ప్రమాణం.ఆంధ్రప్రదేశ్ లోకాయుక్త జస్టిస్‌గా తల్లాప్రగడ మల్లికార్జునరావు ప్రమాణ స్వీకారం చేశారు. విజయవాడలో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరై జస్టిస్ మల్లికార్జునరావుకు అభినందనలు తెలిపారు. ఏపీ లోకాయుక్తగా…
- డొనాల్డ్ ట్రంప్ ‘ట్రూత్ సోషల్’ వేదికగా కీలక పోస్ట్.కెనడాతో వాణిజ్య విభేదాలు కొనసాగుతున్న వేళ.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ‘ట్రూత్ సోషల్’ వేదికగా కీలక పోస్ట్ పెట్టారు. కెనడా, అమెరికాలతో సరిహద్దు పంచుకుంటున్న ‘లేక్ ఆంటారియో’ పేరును ‘లేక్ అమెరికా’గా మార్చే ప్రతిపాదనను సీరియస్‌గా పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు. తాము…
- ప్రొడ్యూసర్ కౌన్సిల్ అధ్యక్ష బరిలో బండ్ల గణేష్.తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ అధ్యక్ష పదవికి ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ నామినేషన్ దాఖలు చేశారు.ఆయనతో పాటు మరో నిర్మాత సి. కళ్యాణ్ కూడా అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నారు. ఈసారి జరగబోతున్న ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఎన్నికలు రసవత్తరంగా మారాయి.దిల్…
- విజయవాడ వేదికగా నేడు డబ్ల్యూఏపీఎల్ ప్లేయర్స్ ఆక్షన్.మహిళల ఏపీ ప్రీమియర్ లీగ్ ప్లేయర్స్ ఆక్షన్‌కు సర్వం సిద్ధమైంది. విజయవాడ వేదికగా నేడు డబ్ల్యూఏపీఎల్ ప్లేయర్స్ వేలం జరగనుంది. వేలంలో 191 మంది మహిళా క్రికెటర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. మేటి ఆటగాళ్ల కోసం నాలుగు ఫ్రాంచైజీలు పోటీ పడనున్నాయి.…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి