ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను సుగాలీ ప్రీతి తల్లి పార్వతి కలిశారు. తన కుమార్తె కేసు పురోగతిపై ఆవేదన వ్యక్తం చేశారు. తన కుమార్తెపై అఘాయిత్యానికి పాల్పడి హత్య చేసిన కేసును సీబీఐకి అప్పగిస్తూ గత ప్రభుత్వం జీవో ఇచ్చిందని… అయితే సీబీఐ వరకూ కేసు వెళ్లలేదని సుగాలీ ప్రీతి తల్లి పార్వతి కన్నీటి పర్యంతమైయ్యారు. మంగళగిరిలో తన కుటుంబంతో పాటు పవన్ కళ్యాణ్‌ని కలిసి వినతి పత్రం ఇచ్చి ఆవేదన వ్యక్తం చేశారు. తమ బిడ్డకు జరిగిన అన్యాయం మరే ఆడ బిడ్డకు జరగకుండా చూడాలని పవన్ కల్యాణ్‌ను కోరారు. సీబీఐ దర్యాప్తు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ఎన్నోసార్లు విజ్ఞప్తి చేసినా స్పందన రాలేదన్నారు. ఈ కేసు విషయంలో తమకు న్యాయం చేయాలని కోరారు. దీనిపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందిస్తూ సుగాలీ ప్రీతి కేసు విషయంలో ఆమె తల్లి పార్వతి పోరాడుతూనే ఉన్నారని అన్నారు. ఈ విషయంపై పోలీసు అధికారులతో మాట్లాడతానని హామీ ఇచ్చారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- జనసేన నేతలతో పవన్ కల్యాణ్ సమావేశం.జనసేన అధినేత, రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అధ్యక్షతన మంగళగిరి కార్యాలయంలో జనసేన ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రిని కావాలని తాను పార్టీ పెట్టలేదని తెలిపారు. తెలంగాణలో మొదలైన జనసేన ప్రస్థానం కేరళతో పాటు…
- మహానాడుపై టీడీపీ అధిష్టానం కీలక నిర్ణయం..తెలుగుదేశం పార్టీ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే మహానాడుపై హై కమాండ్ కీలక నిర్ణయం తీసుకుంది. ముందుగా నెల్లూరులో మూడు రోజుల పాటు నిర్వహించాలని భావించిన మహానాడును ఇప్పుడు మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో హైబ్రిడ్ విధానంలో నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు మే…
- భోజ్‌శాలపై మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పుమధ్యప్రదేశ్లో భోజ్ శాల ఆలయ కేసులో కీలక తీర్పు వెలువడింది. వివాదాస్పద స్థలం ఆలయానికే చెందుతుందని ఆ రాష్ట్ర హైకోర్టు స్పష్టం చేసింది. అక్కడ సరస్వతిదేవి విగ్రహం ఏర్పాటు చేసుకోవచ్చని కేంద్రానికి హైకోర్టు సూచన చేసింది. ఆలయ ప్రాంతాన్ని పురావస్తుశాఖ అధీనంలోకి…
- మంచిర్యాలలో పశువుల అక్రమ రవాణాపై డీసీపీ సమావేశం..మంచిర్యాల జిల్లావ్యాప్తంగా అక్రమ పశువుల రవాణాను అరికట్టేందుకు పోలీస్ శాఖ కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. జిల్లా కేంద్రంలోని ఎం కన్వెన్షన్ హాల్‌లో గోరక్షక్ సభ్యులతో డీసీపీ ఏ. భాస్కర్ ప్రత్యేక సమన్వయ సమావేశం నిర్వహించారు. చట్టప్రకారం ఆవులు, దూడలను వధించడం పూర్తిగా…
- నెల్లూరు జిల్లా కావలిలో పొదుపు మంత్రం..నెల్లూరు జిల్లా కావలిలో పొదుపు మంత్రం పాటిస్తున్నాడు ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి. మోదీ, చంద్రబాబు పిలుపునిచ్చిన పర్యావరణ పరిరక్షణ, ఇంధన పొదుపు సందేశాలను ఆచరణలో చూపిస్తున్నారు. నిరంతరం ప్రజల మధ్యే ఉంటూ, ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా దూసుకుపోతున్న ఎమ్మెల్యే… ఖర్చు…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి





Total views : 78271