గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాలలో సంచలనంగా మారిన దివ్వెల మాధురికి రోడ్డు ప్రమాదం జరిగింది. టెక్కలి నుంచి పలాస వెళ్తున్న సమయంలో దివ్వెల మాధురి కారుకు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో దివ్వెల మాధురికి గాయాలుకాగా.. పలాస ఆస్పత్రికి తరలించారు. వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటంబ వివాదంలో దివ్వెల మాధురి పేరు గత రెండు మూడు రోజులుగా ప్రముఖంగా వినిపిస్తోంది. అయితే టెక్కలి నుంచి పలాస వెళ్తున్న సమయంలో పలాస మండలం లక్ష్మీపురం టోల్ గేట్ వద్ద మాధురి ప్రయాణిస్తున్న కారు.. ఆగి ఉన్న కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో మాధురికి గాయాలు కాగా.. ఆస్పత్రికి తరలించారు. అయితే ప్రమాద సమయంలో మాధురి స్వయంగా కారును నడుపుతున్నట్లు తెలిసింది.
ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే మాధురిని.. పలాస ప్రభుత్వాసుపత్రికి తరిలించారు. అయితే మాధురి చికిత్స తీసుకోవడానికి నిరాకరిస్తున్నారు. దువ్వాడ శ్రీనివాస్ భార్య వాణి చేస్తున్న ఆరోపణలు, వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానంటూ మాధురి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది రోడ్డు ప్రమాదం కాదని.. తానే స్వయంగా కారును నడుపుతూ మరో వాహనాన్ని ఢీకొట్టానని చెప్పారు. తన మీద విపరీతంగా ట్రోలింగ్ జరుగుతోందని.. తనతో పాటుగా, తన పిల్లలపైనా ట్రోలింగ్ జరుగుతోందని మాధురి మీడియాతో తెలిపారు. తనకు బతకాలని లేదని.. అందుకే చనిపోవాలనుకున్నట్లు ఆస్పత్రిలో మాధురి మీడియాకు చెప్పారు. డాక్టర్లు కూడా తనకు చికిత్స అందించొద్దని కోరుతున్నారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.ఏపీలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా పర్యటిస్తున్నారు. విజయవాడకు చేరుకున్న కేంద్రమంత్రికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ఘన స్వాగతం పలికారు. రాష్ట్రంలో వైద్య మౌలిక వసతులను మరింత బలోపేతం చేసే దిశగా కీలక కార్యక్రమాలకు నడ్డా…
- మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో మోదీ భేటీ.బ్రిక్స్ ఇండియా 2026 సదస్సు నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ, మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం మధ్య కీలక ద్వైపాక్షిక భేటీ జరిగింది. న్యూఢిల్లీలో జరిగిన ఈ సమావేశంలో భారత్–మలేషియా సంబంధాలకు సంబంధించిన పలు అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు.…
- ఏడేళ్ల తరువాత భారత్ కు చైనా అధ్యక్షుడు జిన్ పింగ్.ఏడేళ్ల తర్వాత చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ భారత్ పర్యటనకు రానున్నారు. గాల్వాన్ వ్యాలీ ఘటన తర్వాత తొలిసారిగా భారత్‌కు వస్తున్న జిన్‌పింగ్ పర్యటనపై అంతర్జాతీయంగా ఆసక్తి నెలకొంది. మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీకి చేరుకోనున్న జిన్‌పింగ్‌తో పాటు…
- ప్యారడైజ్ నా కెరీర్‌లోనే ఎక్కువ కష్టపడి చేసిన సినిమా.ప్యారడైజ్ నా కెరీర్‌లోనే ఎక్కువ కష్టపడి చేసిన సినిమా. సెప్టెంబర్ 24న వస్తున్నాం. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అడ్రినలిన్ పంపింగ్ హై ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. సినిమా అంతా హైలెట్‌గా ఉంటుంది: ప్రెస్ మీట్‌లో న్యాచురల్ స్టార్ నాని న్యాచురల్ స్టార్…
- ఆర్మీ వెపన్స్ చోరీ కేసులో షాకింగ్ ట్విస్ట్.బొల్లారం మిలటరీ కంపౌండ్ మద్రాసు రెజిమెంట్ యూనిట్ నుంచి మిస్సింగ్ అయిన గన్స్ చోరీ వెనకాల 12 ఏళ్ల పాటు మిలటరీలో పని చేసి బయటికి వచ్చిన ఓ ఉద్యోగి ప్రధాన సూత్రధారిగా ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ కేసు…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి