అయోధ్య రామ మందిరానికి వేల కోట్లలో విరాళాలు వస్తున్నాయి. మనదేశం నుంచే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తుల నుంచి అయోధ్య రాముడికి వేల కోట్లలో విరాళాలు వస్తున్నాయి. గత 10 నెల్లలో రూ. 11 కోట్ల విదేశీ విరాళాలతో పాటు గత మూడేళ్లలో అయోధ్య రామమందిరానికి బంగారం, వెండితో సహా రూ. 2000 కోట్లకు పైగా విరాళాలు అందాయి. మొత్తంగా చూస్తే ఇప్పటి వరకు రూ.5500 కోట్ల భారీ విరాళాలు వచ్చినట్లు తెలుస్తోంది.
ఉత్తర ప్రదేశ్ అయోధ్యలో చారిత్రాత్మక రామమందిరానికి 2020లో ప్రధాని నరేంద్రమోడీ శంకుస్థాపన చేశారు. 2021 ఆలయ నిర్మాణం కోసం నిధుల ప్రచారంలో రూ. 3500 కోట్లు వచ్చాయి. అయోధ్య రామమందిర్ ట్రస్ట్ దేశం, అంతర్జాతీయంగా ప్రతి భాగం నుండి విరాళాలు అందించిన వారికి 10,000 పైగా రసీదులను ముద్రించింది. ఈ ఏడాది జనవరిలో అట్టహాసంగా ఆలయం ప్రారంభమైంది. జనవరి 22న ప్రధాని నరేంద్రమోడీ ఆలయాన్ని ప్రారంభించారు. ఫిబ్రవరి 24 నాటికి కొత్తగా నిర్మించిన ఆలయానికి 25 కేజీల బంగారం, వెండి ఆభరణాలతో సహా దాదాపు రూ. 25 కోట్ల విరాళాలు వచ్చాయి.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లాలో భారీ కొండచరియలు విరిగిపడ్డాయి. కొండచరియ విరిగిపడటంతో ధల్లి… సంజౌలి బైపాస్‌ను పూర్తిగా మూసివేశారు. దీంతో ఇరువైపులా వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. కొండచరియ విరిగిపడటంతో భారీగా శిథిలాలు రహదారిపైకి వచ్చిపడ్డాయి. శిథిలాలు అడ్డంకి ఉండటంతో వాహనాల రాకపోకలకు…
- అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.అమెరికాలోని న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ వద్ద కాల్పులు కలకం సృష్టించాయి. కాల్పులకు తెగబడటమే కాకుండా ఓ వ్యక్తిపై కత్తితో దాడి చేశాడు. నిత్యం రద్దీగా ఉండే మాన్‌హాటన్ పర్యాటక ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కాల్పుల శబ్దం వినిపించడంతో పర్యాటకులు, స్థానికులు…
- అనకాపల్లి జిల్లాలో యలమంచిలిలో ప్రమాదం.ఏపీలో మరో బస్సు ప్రమాదం జరిగింది. అయితే వెంటనే అప్రమత్తం కావడంతో ప్రయాణికులంతా సురక్షితంగా బయట పడ్డారు. అనకాపల్లి జిల్లా ఎలమంచిలి మండలం రేగుపాలెం జాతీయ రహదారిపై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. భువనేశ్వర్ నుంచి చెన్నై…
- వర్షం వస్తేనే జంకుతున్న భద్రాద్రి గిరిజన గ్రామాలు.ఆకాశం నల్లటి మబ్బులు కమ్ముకుంటుంటే అన్నదాత ఆనందంతో మురిసిపోతాడు. కానీ… భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సీతారాంపురం పంచాయతీ పరిధిలోని అన్నారం, చింతలపాడుతో పాటు మరో మూడు గిరిజన గ్రామాల ప్రజల గుండెల్లో మాత్రం వణుకు మొదలవుతుంది. వారికి వర్షం అంటే పరవశం…
- భూగర్భ సంపద దోపిడీ.ప్రభుత్వ ఖజానాకు భారీ గండి.భూగర్భంలో లభించే విలువైన ఖనిజ సంపద అక్రమార్కుల పాలవుతోందా..? ప్రభుత్వానికి రావాల్సిన కోట్లాది రూపాయల ఆదాయం కొందరి జేబుల్లోకి వెళ్తోందా..? భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వైట్ క్వార్జ్ పేరుతో జరుగుతున్న అక్రమ తవ్వకాలు ఇప్పుడు సంచలనంగా మారాయి. అనుమతులు లేకుండానే తెల్లరాయిని…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి





Total views : 149294