అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ ఇంట్లో ఏసీబీ సోదాలు చేపట్టారు అధికారులు . 15 మంది అధికారులతో కూడిన ఏసీబీ బృందం, ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని జోగి రమేశ్ నివాసంలో తనిఖీలు జరిపింది. ఈ సందర్భంగా, పలు రికార్డులు మరియు డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు.
అనంతరం, ఈ కేసులో కీలకంగా భావిస్తున్న జోగి రమేశ్ కుమారుడు జోగి రాజీవ్‌ను అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
ఈ సందర్భంగా జోగి రాజీవ్ మీడియాతో మాట్లాడుతూ, ఈ సోదాలను ప్రభుత్వ కక్షపూరిత చర్యగా అభివర్ణించారు. “నా తండ్రిపై ఉన్న కక్షతోనే నన్ను అరెస్ట్ చేస్తున్నారు. మేము కూడా ఇతరుల్లానే భూములు కొనుగోలు చేశాం. అందులో తప్పేముందో నాకు అర్థం కావడం లేదు” అని రాజీవ్ తెలిపారు. కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు చేపడుతోందని ఆరోపిస్తూ, ఈ కేసును చట్టపరంగా ఎదుర్కొంటామని ఆయన అన్నారు. సీఐడీ జప్తులో ఉన్న భూములను కొనుగోలు చేసి విక్రయించినట్టు జోగి రమేశ్‌పై ఆరోపణలు రావడంతో, ఈ కేసు నేపథ్యంలోనే ఏసీబీ అధికారులు ఈ సోదాలు నిర్వహించారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- వడ్ల కొనుగోలు కేంద్రాల వద్ద ప్రతిపక్షాల డ్రామాలుప్రతిపక్షాలు కావాలనే కొన్ని కొనుగోలు కేంద్రాల వద్ద రాజకీయ డ్రామాలు చేస్తున్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. రైతులకు ఎక్కడా ఇబ్బందులు లేవని ఆయన పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా, మానకొండూరు నియోజకవర్గంలోని కేశవపట్నం మండలం, తాడికల్ గ్రామంలో గల…
- నష్టాల్లో కంగువా నిర్మాత … అండగా హీరో సూర్యదర్శకుడు శివ తెరకెక్కించిన ఈ సినిమాలో దిశా పటాని హీరోయిన్ గా, తమిళ స్టార్ సూర్య హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ కంగువా. ఇది ఒక పీరియాడికల్ డ్రామా కాన్సెప్ట్ తో సరికొత్త కథతో వచ్చిన ఈ సినిమా…
- ఆర్జీవీ అరెస్ట్ కు రంగం సిద్ధం…వివాదాలకు కేర్ అఫ్ అడ్రెస్స్ ల మారిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మను అరెస్ట్ చేస్తారా.. లేదా.. అన్న అంశం అందరిని ఆలోచింపచేస్తుంది. ఆర్జీవీని అరెస్ట్ చేసేందుకు ప్రకాశం జిల్లా పోలీసులు.. ఆయన ఇంటి వద్ద ఆర్జీవీ కోసం…
- మంత్రి వస్తేనే కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీకళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు మంత్రి వస్తేనే పంపిణీ చేస్తామని అధికారులు చెబుతూ లబ్ధిదారులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆరోపించారు. ఎమ్మెల్యే చెక్కులు పంపిణీ చేయడం ఆనవాయితీ కానీ మంత్రి…
- నిందితులతో కలిసి పోలీసుల చేతివాటంపోలీసులే నిందితులతో చేతులు కలిపి వారి వద్ద భారీ ఎత్తున డబ్బులు తీసుకున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పశ్చిమ గోదావరి జిల్లాలోని తణుకు మండలం, వేల్పూరు గ్రామంలో రెండు గేదెలను అపహరించిన కేసులో తణుకు రూరల్ పోలీసులు…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి