Friday, September 11, 2026
News Navigation
Friday, September 11, 2026
News Navigation

Breaking

Friday, September 11, 2026
Home Political మళ్లీ డేంజర్ జోన్ లో ఖమ్మం

మళ్లీ డేంజర్ జోన్ లో ఖమ్మం

by Satya
మళ్లీ డేంజర్ జోన్ లో ఖమ్మం

ఖమ్మం జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలతో మున్నేరు వాగు ప్రవాహం మరోసారి పెరుగుతుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయ, మార్కెటింగ్, టెక్స్‎టైల్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని, ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు. అవసరమైతే సహాయక శిబిరాలు మళ్లీ తెరవాలని అధికారులను మంత్రి తుమ్మల ఆదేశించారు.
మళ్లీ డేంజర్ జోన్ లో ఖమ్మం జిల్లాలో లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను వెంటనే అక్కడి నుంచి తరలించాలని మంత్రి తుమ్మల ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన సహాయ శిబిరాలకు వెళ్లాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ సూచనలను పాటించి, తగినంత జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో సంబంధిత అధికారులతో సంప్రదించాలని మంత్రి తుమ్మల కోరారు.అధికారులు వెంటనే అన్నిరకాల ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రస్తుత పరిస్థితులు పూర్తిగా అదుపులోకి వచ్చేవరకు, ప్రజలకు సహాయక చర్యలు నిరంతరం అందుబాటులో ఉంచేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి తుమ్మల తెలిపారు.

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: