ఖమ్మంలో మళ్లీ భారీ వర్షం కురుస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఖమ్మం నగరంలో వరద ముప్పు పెరగడంతో వరద బాధితులు మళ్లీ భయాందోళనలకు గురవుతున్నారు. మున్నేరు మళ్లీ ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ప్రజలు నరకయాతన పడుతున్నారు. ఖమ్మం వద్ద మున్నేరు ప్రవాహం క్రమక్రమంగా పెరుగుతోంది. 10 అడుగులకు మున్నేరు ప్రవాహం చేరుకోవడంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ ఉండాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. మున్నేరు పరివాహక ప్రాంతాలైన రామన్నగూడెం, దానవాయిగూడెం, ప్రకాశ్ నగర్, మోతీ నగర్, వేంకటేశ్వర కాలనీ, పద్మావతి నగర్, పెద్దతండా, సాయి గణేష్ నగర్ మున్నేరు వరద ప్రవాహం పెరుగుతోంది. దీంతో ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మున్నేరు పరివాహక ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు అధికారులు తరలిస్తున్నారు. అధికారులు సహాయక చర్యలను వేగవంతం చేశారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- జింబాబ్వేతో జరిగిన T20I సిరీస్‌ను 3-0 తేడాతో కైవసం చేసుకున్న టీమిండియా.UK పర్యటనలో నిరాశపరిచిన తర్వాత భారత్ కోరుకున్న ఫలితం ఇదే. జింబాబ్వే గడ్డపై ఆ జట్టును పూర్తిగా అధిగమించి 3-0 తేడాతో క్లీన్ స్వీప్ పూర్తి చేసింది. వాస్తవానికి ఈ సిరీస్ అంతటా జింబాబ్వే జట్టు భారత్కు ఏమాత్రం పోటీనివ్వలేకపోయింది. భారత్…
- మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలంలో వైసీపీకి బిగ్ షాక్.మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలంలో వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మాగుటూరు పంచాయతీలోని రంగాపురం గ్రామానికి చెందిన 65 కుటుంబాలు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరాయి. స్థానిక ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి సమక్షంలో ఈ భారీ చేరికలు జరిగాయి.…
- రాజకీయాలు కలుషితం అయ్యాయి -సిద్ధరామయ్య.కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య సంచలన ప్రకటన చేశారు. తాను 2028 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోనని, ఎన్నికల రాజకీయాల నుంచి శాశ్వతంగా వైదొలుగుతున్నానని స్పష్టం చేశారు. అయితే, ప్రజా జీవితంలోనే కొనసాగుతూ ప్రజల పక్షాన తన గొంతు వినిపిస్తూనే ఉంటానని…
- నంద్యాల జిల్లాలో నలుగురు ఫారెస్ట్ అధికారుల సస్పెన్షన్.నంద్యాల జిల్లా ఆత్మకూరు వన్యప్రాణి అటవీ డివిజన్‌లో అధికారుల చేతివాటం తీవ్ర కలకలం రేపింది. స్మగ్లర్ల నుంచి స్వాధీనం చేసుకున్న లక్షలాది రూపాయల విలువైన టేకు కలపను ప్రభుత్వ డిపోకు తరలించకుండా ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముకునేందుకు ప్రయత్నించిన ఘటనా స్థానికంగా చర్చనీయాంశంగా…
- సీబీఎస్ఈ, నీట్ నిర్వహణలో కేంద్రం విఫలమైందని ఆరోపణ.సీబీఎస్ఈ, నీట్ వంటి కీలక జాతీయ స్థాయి పరీక్షల నిర్వహణలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. నీట్ పరీక్షలో జరిగిన అవకతవకలు, విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని ప్రతిపక్షం, ముఖ్యంగా…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి