Monday, May 18, 2026
News Navigation
Monday, May 18, 2026
News Navigation

Breaking

Monday, May 18, 2026
Home Andhra Pradesh నందిగం సురేశ్‌కు ఏపీ హైకోర్టులో భారీ ఊరట

నందిగం సురేశ్‌కు ఏపీ హైకోర్టులో భారీ ఊరట

by Satya
నందిగం సురేశ్‌కు ఏపీ హైకోర్టులో భారీ ఊరట

టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో అరెస్టై జైల్లో ఉన్న మాజీ ఎంపీ నందిగం సురేశ్‌కు ఏపీ హైకోర్టులో భారీ ఊరట దక్కింది. బాపట్ల మాజీ ఎంపీకి హైకోర్టు ధర్మాసనం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. నందిగం సురేశ్‌తో పాటు విజయవాడ మాజీ మేయర్ భర్తకు కోర్టు బెయిల్ ఇచ్చింది.

టీడీపీ పార్టీ కార్యాలయంపై దాడి కేసుకు సంబంధించి గత నెలలో సురేశ్‌ను ఏపీ పోలీసులు హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు. అక్కడి నుంచి గుంటూరుకు తరలించారు. ఆయన ముందుస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించగా ఊరట దక్కలేదు. దీంతో పోలీసులు అరెస్ట్ చేసేందుకు ఆయన ఇంటికి వెళ్లగా కనిపించలేదు. ముమ్మర తనిఖీలు చేపట్టిన పోలీసులు హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకున్నారు. కోర్టులో ప్రవేశపెట్టగా అతనికి జ్యుడిషియల్ రిమాండ్ విధించింది.

టీడీపీ కార్యాలయంపై దాడికి సంబంధించి వివరాలు సేకరించేందుకు సురేశ్‌ను తమ కస్టడీకి అప్పగించాలని పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు అనుమతితో రెండు రోజులు కస్టడీలోకి తీసుకొని విచారించారు. నిన్నటితో రిమాండ్ ముగియడంతో పోలీసులు అతనిని కోర్టులో హాజరుపరచగా, ఈ నెల 17 వరకు జ్యుడిషియల్ రిమాండ్‌ను పొడిగించింది. మరోవైపు, ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు, ఈరోజు బెయిల్ మంజూరు చేసింది.

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

  • పుట్టపర్తిలో పర్యావరణ హితంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సరికొత్త ముందడుగు..
    సరికొత్త ఆదర్శానికి వేదికైంది శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టరేట్. ఇంధన పొదుపు, పర్యావరణ పరిరక్షణ కేవలం మాటలకే పరిమితం కాదని స్వయంగా ఆచరించి చూపించారు జిల్లా కలెక్టర్ ఎ. శ్యామ్ ప్రసాద్. సోమవారం కలెక్టరేట్‌లో జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదిక…
  • Punjab Kingsకు వరుసగా ఆరో ఓటమి.. ప్లేఆఫ్స్ ఆశలు సంకటంలో..
    పంజాబ్ కింగ్స్‌కు ఇది వరుసగా 6వ ఓటమి, దీంతో వారి సీజన్ పూర్తిగా తలకిందులైంది. ప్లేఆఫ్స్ రేస్ వేడెక్కుతున్న ఈ సమయంలో ఇది Chennai Super Kings, Kolkata Knight Riders, Rajasthan Royals మరియు బహుశా Delhi Capitals వంటి…
  • Delhi Capitals అద్భుత ఫినిష్‌తో ఉత్కంఠ పోరులో విజయం..
    ఈ మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు స్వల్ప తేడాతో విజయం సాధించింది. అబిషేక్ పోరెల్ మరియు KL రాహుల్ తమ జట్టుకు మంచి ఆరంభాన్ని ఇచ్చారు. పవర్‌ప్లేలో 72 పరుగులు వచ్చాయి, 10వ ఓవర్ ముగిసే సరికి ఢిల్లీ క్యాపిటల్స్ 105/0 వద్ద…
  • ఉమ్మడి నల్గొండ జిల్లాలో నత్తనడకన ధాన్యం కొనుగోళ్లు..
    అన్నదాతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఆకాశంలో మబ్బులు కమ్ముకుంటుంటే.. కల్లాల్లో రైతుల కన్నీళ్లు ఉప్పొంగుతున్నాయి. పంటలు పండించిన పాపానికి..అమ్ముకోలేక దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు ఉమ్మడి నల్గొండ జిల్లా రైతులు. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి నెల రోజులు గడుస్తున్నా.. క్షేత్రస్థాయిలో…
  • కోనసీమ జిల్లా రాజోలులోని సీహెచ్ సీ లో గైనకాలజిస్టుల కొరత..
    డాక్టర్..బిఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలులోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో గైనకాలజిస్టుల కొరత వేధిస్తోంది. ప్రభుత్వ ఆసుపత్రిలో మూడేళ్లుగా గైనకాలజిస్ట్ లేకపోవడంతో గర్భిణులు, మహిళలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. అరవై గ్రామాలకు ఆరోగ్యదాయనిగా ఉన్న రాజోలు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నందు…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Our Visitor

014458
Total views : 80254

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.