హరియాణాలో ప్రశాంతంగా కొనసాగుతున్నఅసెంబ్లీ ఎన్నికల పోలింగ్. రాష్ట్రంలోని మొత్తం 90 స్థానాలకు ఉదయం 7 గంటలకే ఓటింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. పలువురు ప్రముఖులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. పారిస్ ఒలింపిక్స్ డబుల్ పతకాలు సాధించిన స్టార్ షూటర్ మను బాకర్ ..ఝజ్జర్‌లోని పోలింగ్ కేంద్రంలో కుటుంబంతో కలిసి ఓటేసింది. ఎన్నికల్లో తాను ఓటు హక్కు వినియోగించుకోవడం ఇదే తొలిసారి అని బాకర్ తెలిపింది. చిన్న అడుగులే పెద్ద లక్ష్యాలను చేరుకుంటాయని.. దేశ యువతగా ఓటు వేయడం మనందరి బాధ్యతని మను బాకర్… యువతకు పిలుపునిచ్చింది.
కర్నాల్‌లో కేంద్రమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఈ ఎన్నికల్లో భాజపా విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తంచేశారు. చర్కి దాద్రిలోని పోలింగ్ కేంద్రంలో మాజీ రెజ్లర్, కాంగ్రెస్ అభ్యర్థి వినేశ్ ఫొగాట్ ఓటు వేశారు. ఈ ప్రజాస్వామ్య పండుగలో ప్రజలంతా పాల్గొనాలని పిలుపునిచ్చారు. గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్ కురుక్షేత్రలో ఓటుహక్కు వినియోగించుకున్నారు. హరియాణా ముఖ్యమంత్రి, బీజేపీ అభ్యర్థి నాయబ్ సింగ్ సైనీ అంబాలాలో ఓటు వేశారు. రాష్ట్రంలో మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తామంటూ విశ్వాసం వ్యక్తంచేశారు. ఫరీదాబాద్‌లో కేంద్రమంత్రి కృషణ్ పాల్ గుర్జార్, సిర్సాలో మాజీ ఉప ముఖ్యమంత్రి దుశ్యంత్ చౌటాలా ఓటుహక్కు వినియోగించుకున్నారు. భారత సంపన్న మహిళ, స్వతంత్ర అభ్యర్థి సావిత్రి జిందాల్ హిస్సార్‌లో ఓటు వేశారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్ బ్యానర్.పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన “ఎస్ ఆర్ కళ్యాణమండపం” డైరెక్టర్ శ్రీధర్ గాదె, శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్ బ్యానర్ ప్రొడక్షన్ నెం.3 సినిమా “ఎస్ఆర్ కళ్యాణమండపం” చిత్రంతో అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించి దర్శకుడిగా ప్రతిభ చాటుకున్న డైరెక్టర్ శ్రీధర్…
- “15 ఏళ్ల నా కల నెరవేరింది.” ‘పంచనామా’ ప్రివ్యూలో ఉదయభాను ఎమోషనల్.“15 ఏళ్ల నా కల నెరవేరింది.. నా బిడ్డలా చూసుకున్నా..” ‘పంచనామా’ ప్రివ్యూలో ఉదయభాను ఎమోషనల్ తెలుగు ప్రేక్షకులను అలరించేలా విభిన్నమైన, ఆసక్తికరమైన కథాంశాలతో ముందుకు సాగుతున్న జీ5 మరో ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్‌ను అందుబాటులోకి తీసుకురాబోతుంది. అదే ‘పంచనామా’ సిరీస్.…
- హైకూ’ టీజర్.. అందమైన కవితలాంటి ప్రేమ. కెమిస్ట్రీతో మెప్పిస్తోన్న టీజర్.హైకూ’ టీజర్.. అందమైన కవితలాంటి ప్రేమ. కెమిస్ట్రీతో మెప్పిస్తోన్న టీజర్. విజన్ సినిమా హౌస్ బ్యానర్‌పై ఏగన్ హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘హైకూ’. ఈ మూవీ టీజర్‌ను ప్రముఖ రొమాంటిక్ హీరో హరీష్ కళ్యాణ్ రిలీజ్ చేశారు. కలర్‌ఫుల్ విజువల్స్,…
- ఘనంగా “కళ్యాణం కమనీయం జీవితం” సినిమా ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.ఈ నెల 18న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ వివిఫై మీడియా ఫిల్మ్ ఫ్యాక్టరీ పతాకంపై, ఖాన్ దురాని, సాహితి ఆవంచ హీరో హీరోయిన్స్ గా రవి లోకిరెడ్డి డైరెక్షన్ లో పైలా ప్రసాద్ రావు,…
- ఘనంగా “ఐ బొమ్మ” సినిమా ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.బానోత్ పవన్, గౌతమ్, నర్మద, సతీష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా “ఐ బొమ్మ”. ఈ చిత్రాన్ని శ్రీ మల్లన్న క్రియేషన్స్ బ్యానర్ పై కురువ జమన్న నిర్మిస్తున్నారు. విజయ్ రఘునాథభట్ల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా త్వరలో వరల్డ్ వైడ్…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి