రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని బడంగ్ పేట్ కార్పొరేషన్లో హైడ్రా పంజా విసిరింది. మున్సిపల్ కార్పొరేషన్ 4వ డివిజన్ వెంకటేశ్వర కాలనీలో ఏనుగు సురేందర్ రెడ్డి పార్కు స్థలాన్ని ఆక్రమించాడు. సురేందర్ రెడ్డి సుమారు వేయి గజాల పార్కు స్థలాన్ని ఆక్రమించి, కంటైనర్ను ఏర్పాటు చేశాడు. గతంలో పలుమార్లు మున్సిపల్ అధికారులు పార్కు స్థలమని బోర్డు ఏర్పాటు చేశారు. అయినా ఆ సైన్ బోర్డును సురేందర్ రెడ్డి పట్టించుకోలేదని స్థానికులు తెలిపారు. ఈ నేపథ్యంలో పార్కు స్థలం ఆక్రమణకు గురైందని కాలనీవాసులు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుతో హైడ్రా ఇన్స్పెక్టర్ తిరుమలేష్, పోలీసు సిబ్బంది స్పందించారు. సురేందర్ రెడ్డి అక్రమంగా ఏర్పాటు చేసిన కంటైనర్ను తొలగించారు. పార్కు స్థలాన్ని సురేందర్ రెడ్డి చెర నుంచి విడిపించి, మున్సిపల్ అధికారులకు అప్ప చెప్పారు. అధికారులు, ఆయా పార్టీ నేతల అండదండలతో బడంగ్ పేటలో కబ్జాలు జరుగుతున్నాయని స్థానికులు వాపోతున్నారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- ‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కి థాంక్స్..‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కి థాంక్స్.. యునానిమస్ బ్లాక్ బస్టర్ సెలెబ్రేషన్స్‌లో హీరో సూరి మంచి విజయాన్ని ఇచ్చిన ఆడియెన్స్‌కి థాంక్స్.. ‘మండాడి’ యునానిమస్ బ్లాక్ బస్టర్ సెలెబ్రేషన్స్‌లో హీరో సుహాస్ ఎల్రెడ్ కుమార్ సమర్పణలో ఆర్ఎస్…
- నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.ఏపీలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా పర్యటిస్తున్నారు. విజయవాడకు చేరుకున్న కేంద్రమంత్రికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ఘన స్వాగతం పలికారు. రాష్ట్రంలో వైద్య మౌలిక వసతులను మరింత బలోపేతం చేసే దిశగా కీలక కార్యక్రమాలకు నడ్డా…
- మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో మోదీ భేటీ.బ్రిక్స్ ఇండియా 2026 సదస్సు నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ, మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం మధ్య కీలక ద్వైపాక్షిక భేటీ జరిగింది. న్యూఢిల్లీలో జరిగిన ఈ సమావేశంలో భారత్–మలేషియా సంబంధాలకు సంబంధించిన పలు అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు.…
- ఏడేళ్ల తరువాత భారత్ కు చైనా అధ్యక్షుడు జిన్ పింగ్.ఏడేళ్ల తర్వాత చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ భారత్ పర్యటనకు రానున్నారు. గాల్వాన్ వ్యాలీ ఘటన తర్వాత తొలిసారిగా భారత్‌కు వస్తున్న జిన్‌పింగ్ పర్యటనపై అంతర్జాతీయంగా ఆసక్తి నెలకొంది. మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీకి చేరుకోనున్న జిన్‌పింగ్‌తో పాటు…
- ప్యారడైజ్ నా కెరీర్‌లోనే ఎక్కువ కష్టపడి చేసిన సినిమా.ప్యారడైజ్ నా కెరీర్‌లోనే ఎక్కువ కష్టపడి చేసిన సినిమా. సెప్టెంబర్ 24న వస్తున్నాం. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అడ్రినలిన్ పంపింగ్ హై ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. సినిమా అంతా హైలెట్‌గా ఉంటుంది: ప్రెస్ మీట్‌లో న్యాచురల్ స్టార్ నాని న్యాచురల్ స్టార్…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి