Friday, September 11, 2026
News Navigation
Friday, September 11, 2026
News Navigation

Breaking

Friday, September 11, 2026
Home Crime బెంగళూరు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ సూసైడ్ కేసులో పురోగతి

బెంగళూరు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ సూసైడ్ కేసులో పురోగతి

by Rama
బెంగళూరు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ సూసైడ్ కేసులో పురోగతి

బెంగళూరు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అతుల్ సుభాష్ ఆత్యహత్య కేసులో సంచలన పరిణామం చోటుచేసుకుంది. అతడి బలబన్మరణానికి పరోక్షంగా కారణమైన భార్య నిఖితా సింఘానియా , అత్త నిషా, బావమరిది అనురాగ్‌ ను తాజాగా బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. అయితే, నిఖితాను హర్యానా లోని గురుగ్రామ్‌ లో అదుపులోకి తీసుకోగా.. అత్త, బావమరిదిని ఉత్తరప్రదేశ్‌ లోని అలహాబాద్‌ లో అరెస్ట్ చేసి ముగ్గురిని జ్యుడిషియల్ రిమాండ్‌ కు పంపినట్లుగా పోలీసులు వెల్లడించారు.

కాగా, భార్య వేధింపుల కారణంగా అతుల్ సుభాష్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఆత్మహత్యకు ముందు అతడు విడుదల చేసిన సెల్ఫీ వీడియో , 24 పేజీల సూసైడ్ నోట్ అందరి చేత కన్నీళ్లు పెట్టించింది. అయితే, అతుల్ రాసిన లేఖలో తన భార్య మరో వ్యక్తితో వివాహేతర బంధం కొనసాగిస్తున్నట్లుగా తెలిపాడు. తాను విడాకులు కోరగా.. తిరిగి తనపైనే అక్రమ కేసులు పెట్టిందని ఆరోపించాడు. అదేవిధంగా ఆమెపై హత్యాయత్నం చేశానని, ఇష్టం లేకుండా సెక్స్ చేసేందుకు ప్రయత్నించానంటూ ఆరోపించిందని వీడియోలో ఆవేదన వ్యక్తం చేశారు. చివరికి కోర్టులో నెలకు రూ.2 లక్షల చొప్పున భరణం ఇవ్వాలంటూ భార్య నిఖితా నోటీసులు పంపిందని అతుల్ కన్నీటిపర్యంతమై తీవ్ర మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి సోదరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న బెంగళూరు పోలీసులు తాజాగా, నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు అతుల్ ఆత్మహత్యపై సోషల్ మీడియా ఫ్లాట్‌ఫాం ‘X’ ‌లో కూడా ‘మెన్ టూ’ఉద్యమం ట్రెండింగ్‌లో నిలిచింది.

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: