Wednesday, August 26, 2026
News Navigation
Wednesday, August 26, 2026
News Navigation

Breaking

Wednesday, August 26, 2026
Home Latest News రాష్ట్రంలో ఇంధన కొరత లేదని స్పష్టం చేసిన అసోసియేషన్.

రాష్ట్రంలో ఇంధన కొరత లేదని స్పష్టం చేసిన అసోసియేషన్.

by CVR NEWS

తెలంగాణ రాష్ట్రంలో ఇంధన కొరత ఉందనే ప్రచారం పూర్తిగా అవాస్తవమని తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ కీలక ప్రకటన చేసింది. గత కొన్ని రోజులుగా పెట్రోల్ బంకుల్లో ఇంధన కొరత ఉందనే వార్తలు ప్రచారం కావడంపై అసోసియేషన్ స్పందించింది. HPCL, IOCL, BPCL కంపెనీల వద్ద సరిపడా ఇంధన నిల్వలు ఉన్నాయని అసోసియేషన్ ధృవీకరించింది. రాష్ట్రంలోని అన్ని పెట్రోల్ బంకుల్లో ఇంధనం అందుబాటులో ఉందని, ఎటువంటి ఇబ్బంది లేదని స్పష్టం చేసింది. విపరీతమైన రద్దీ కారణంగా కొన్ని బంకుల్లో తాత్కాలికంగా ఇంధన కొరత ఏర్పడిందని, దీనిని ఇంధన కొరతగా భావించవద్దని అసోసియేషన్ తెలిపింది. వినియోగదారులు పుకార్లను నమ్మవద్దని, ఆందోళన చెందవద్దని విజ్ఞప్తి చేసింది. ఇంధనం దొరకదన్న భయంతో బంకుల వద్దకు క్యూ కడుతున్నారని, నిల్వలు ఉంచుకునేందుకు ముందస్తు కొనుగోళ్లతో ఇబ్బంది ఏర్పడుతోందని అసోసియేషన్ తెలిపింది.

హైదరాబాద్ సహా రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో ఉన్న పెట్రోల్ బంకులు వాహనదారులతో రద్దీగా కనిపిస్తున్నాయి. కిలోమీటర్ల మేర వాహనాలు పెట్రోల్ బంకుల వద్ద క్యూ కట్టాయి. ఆటోలు, కార్లు, కంటైనర్లు కూడా పెట్రోల్ బంకుల వద్ద గంటల తరబడి నిరీక్షిస్తున్నాయి. ఎవరి నోట చూసిన ఫుల్ ట్యాంక్ మాటే వినిపిస్తుండటంతో..బంకుల్లో నిల్వ ఉన్న పెట్రోల్, డీజిల్ ఖాళీ అవుతుంది. మళ్లీ వాటిని నింపేందుకు సమయం పడుతుండటం వల్లే నో స్టాక్ బోర్డులు పెట్టాల్సి వస్తోందని, తీవ్రమైన కొరత ఉందన్నది అవాస్తవమని బంకుల యజమాన్యాలు కూడా చెప్తున్నాయి. ఇంధన కొరత లేదని ఎంతచెప్తున్నా వాహనదారులు వినడం లేదని వాపోతున్నాయి.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: