పసుపు పండుగ మహానాడుకు భారీ ఏర్పాట్లు చేస్తోంది టీడీపీ. నెల్లూరు వేదికగా ఈసారి వేడుక జరగనుంది. ఈ నెల 27, 28, 29 తేదీల్లో మూడు రోజుల పాటు ఘనంగా జరిగే ఈ వేడుకల కోసం టీడీపీ అధిష్టానం భారీ స్థాయిలో ఏర్పాట్లు చేస్తోంది. వేడుకలను పకడ్బందీగా నిర్వహించేందుకు మొత్తం 20 ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసింది. పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ నేతృత్వంలోని 10 మంది సభ్యుల సమన్వయ కమిటీ ఈ పనులన్నింటినీ పర్యవేక్షించనుంది. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాదిగా తరలివచ్చే కార్యకర్తలకు ఎక్కడా ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు ఉండాలని చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. కమిటీల వారీగా బాధ్యతలను పరిశీలిస్తే పల్లా శ్రీనివాసరావు నేతృత్వంలో ఆహ్వాన కమిటీ, యనమల రామకృష్ణుడు నేతృత్వంలో తీర్మానాల కమిటీని నియమించారు. సభా నిర్వహణ బాధ్యతలను పయ్యావుల కేశవ్, రామ్మోహన్ నాయుడు పర్యవేక్షించనుండగా, అచ్చెన్నాయుడు నేతృత్వంలోని కమిటీ.. వసతి సౌకర్యాలను చూసుకోనుంది. నెల్లూరులోని ఇఫ్కో కిసాన్ సెజ్ ప్రాంతంలో సుమారు 150 ఎకరాల్లో ఈ కార్యక్రమం జరగనుంది. ఈ వేడుకను చారిత్రాత్మక విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులు ఉత్సాహంగా ఉన్నాయి.
నెల్లూరులో మహానాడుకు భారీ ఏర్పాట్లు..
150
previous post





Total views : 181089