Saturday, August 15, 2026
News Navigation
Saturday, August 15, 2026
News Navigation

Breaking

Saturday, August 15, 2026
Home Latest News విజయ్ ప్రమాణ స్వీకారంపై మరోసారి సందిగ్ధత..

విజయ్ ప్రమాణ స్వీకారంపై మరోసారి సందిగ్ధత..

by CVR NEWS
విజయ్ ప్రమాణ స్వీకారంపై మరోసారి సందిగ్ధత

విజయ్ సీఎంగా పట్టాభిషేకంపై మరోసారి సందిగ్ధత నెలకొంది. ఇవాళ ఉదయం జరగాల్సిన ప్రమాణ స్వీకార వేడుకపై రాజ్‌భవన్ నీళ్లు చల్లింది. విజయ్ ప్రమాణ స్వీకారం లేదని లోక్‌భవన్ వర్గాలు స్పష్టం చేయడంతో ఒక్కసారిగా తమిళ రాజకీయాలు వేడెక్కాయి. నిజానికి, 2026 ఎన్నికల ఫలితాల తర్వాత విజయ్ నేతృత్వంలోని TVK మ్యాజిక్ ఫిగర్‌కు చేరువలో నిలిచింది. అయితే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే కనీసం 118 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. ప్రస్తుత సమాచారం ప్రకారం, విజయ్ దగ్గర కేవలం 116 మంది సభ్యుల మద్దతు లేఖలు మాత్రమే ఉన్నాయి. అసలు చిక్కు ఎక్కడ వచ్చిందంటే.. మిత్రపక్షాలుగా భావిస్తున్న IUML , VCK తమ మద్దతు లేఖలను ఇంకా గవర్నర్‌కు సమర్పించలేదు. ఈ రెండు పార్టీల లేఖలు అందకపోవడంతో సాంకేతికంగా విజయ్ ఇంకా మెజారిటీని నిరూపించుకోలేకపోయారు

మరోవైపు లోక్‌భవన్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. రేపు ప్రమాణ స్వీకారం జరిగే అవకాశం లేదని తెలుస్తోంది. మెజారిటీపై పూర్తి స్పష్టత రాకుండా, కేవలం 116 మందితో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఆహ్వానించలేమని గవర్నర్ కార్యాలయం భావిస్తోంది. దీంతో చెన్నైలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియం వద్ద జరుగుతున్న ఏర్పాట్లు, అభిమానుల సంబరాలు అయోమయంలో పడ్డాయి.
మరి ఈ ప్రతిష్టంభన ఎప్పుడు తొలగుతుంది? IUML , VCK పార్టీలు తమ మద్దతు లేఖలను ఎప్పుడు అందజేస్తాయి? విజయ్ ఆ రెండు పార్టీల నేతలతో జరుపుతున్న చర్చలు ఫలిస్తాయా? లేక ముఖ్యమంత్రి పీఠం కోసం దళపతి మరికొంత కాలం వేచి చూడాల్సిందేనా? అనే చర్చ ఇటు రాజకీయ వర్గాల్లో అటు టీవీకే శ్రేణుల్లోనూ సాగుతోంది.

మరోవైపు CPI, CPI(M) పార్టీలు విజయ్‌కు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించాయి. అయితే, వీరు ప్రభుత్వంలో చేరబోమని, కేవలం బయటి నుంచే మద్దతు ఇస్తామని క్లారిటీ ఇచ్చారు. మరోవైపు విజయ్‌ను అధికారానికి దూరం చేయడానికి దశాబ్దాల వైరిని పక్కన పెట్టి DMK, AIADMK లోపాయికారీగా కలిసే అవకాశం ఉందన్న ప్రచారం జోరందుకుంది. ఒకవేళ విజయ్ మెజారిటీ నిరూపించుకోకపోతే, గవర్నర్ ప్రత్యామ్నాయ అవకాశాలను పరిశీలిస్తామన్నారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: